చిరు కూతురి పెళ్లికి వేదిక ఫైనల్ అయిపోయింది

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు పెళ్లి ఎక్కడ చేయాలో ఇప్పుడు ఫైనల్ అయిపోయింది. మొదట హైద్రాబాద్ తర్వాత తిరుపతి – ఆ తర్వాత చెన్నై – నెక్ట్స్ రాజస్థాన్.. ఇలా అనేక ప్లేసులు అనుకున్న తర్వాత.. డెస్టినేషన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ జరగనున్న శ్రీజ-కళ్యాణ్ ల వివాహ వేడుకకు వేదికను ఫైనల్ చేశారు. బెంగళూరులోని ఓ ఫాం హౌజ్ లో అత్యంత వైభవంగా తన చిన్న కూతురు పెళ్లి చేయబోతున్నారు చిరంజీవి.

ఇప్పుడు బెంగళూరులో ఈ నెల 28న పెళ్లి వేడుక జరుగనుండగా.. ఒక రోజు ముందు భారీ ఎత్తున సంగీత్ నిర్వహించనున్నారు. మార్చ్ 27న జరిగే సంగీత్ లో డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా ఉంటాయట. చిరు ఫ్యామిలీలోని అందరూ ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. బెంగళూరులో పెళ్లి వేడుక పూర్తయ్యాక.. హైద్రాబాద్ లో పెద్ద రిసెప్షన్ ఏర్పాటు చేయాలని చిరంజీవి నిర్ణయించారు. అయితే..  ఈ రిసెప్షన్ కి మాత్రం ఇంకా డేట్ ఫైనల్ చేయలేదు.

Videos

21 thoughts on “చిరు కూతురి పెళ్లికి వేదిక ఫైనల్ అయిపోయింది

Leave a Reply

Your email address will not be published.