మళ్ళీ శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత్త

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతుంది. దీనితో ఆరు గేట్లను పది అడుగుల మేర ఎత్తి సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. ఆనకట్ట గేట్ల నిర్వహణలో అలసత్వం కారణంగా స్పిల్‌వే నుంచి కాకుండా 2, 3, 10, 11, 12 గేట్లపై నుంచి నీరు దిగువకు ప్రవహిస్తోంది. కానీ దీనివల్ల డ్యామ్ భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదని శ్రీశైలం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ చెబుతున్నారు. జలాశయానికి 3.49 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, ఔట్ ఫ్లో 3.55 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం 884.90 అడుగుల నీటిమట్టం నమోదైంది. పూర్తి స్థాయి నీటి నిలవ 215.80 టి‌ఎం‌సి లకు గాను, ప్రస్తుతం 215.32 టి‌ఎం‌సి నీరు ఉంది.  కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కులు, హంద్రీనివకు 2,026 క్యూసెక్కులు, పోతిరెస్సిపాడు ఎత్తిపోతల పథకానికి 28,500 క్యూసెక్కులు, కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలకు 80 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Videos