అంగరంగ వైభవంగా క్రిష్ పెళ్ళి!

తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనదైన బ్రాండ్ సృష్టించుకొని సినిమాలు తీసుకుంటూ వెళుతోన్న క్రిష్, పెళ్ళి అనే బంధంతో ఓ ఇంటివాడయ్యారు. హైద్రాబాద్‌కు చెందిన డాక్టర్ రమ్యతో క్రిష్ వివాహం గోల్గొండ రిసార్ట్స్‌లో నిన్న సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది.

ప్రముఖ దర్శకుడు క్రిష్‌ (జాగర్లమూడి రాధాకృష్ణ) వివాహం డా.రమ్యసాయితో హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది. మేళతాళాలు, వేదమంత్రాల మధ్య రాత్రి 9గంటల 5నిమిషాలకి జీలకర్ర, బెల్లం తంతుతో కొత్త జంట ఒక్కటైంది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్‌లో జరిగిన దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ, డా. రమ్యసాయిల వివాహానికి పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ”దేవతలే బంధువుల్లా వస్తారంట… మీరొస్తే ఒక దేవతొచ్చినట్టే… మీ కోసం మీ ఆశీస్సుల కోసం వేదమంత్రాలు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తుంటాయని మర్చిపోకండి. మీరు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి నన్నూ మా ఆవిడ్నీ ఆశీర్వదించాలని మా అమ్మ అంజనాదేవి, నాన్నగారు సాయిబాబుగారు కూడా మీకు మరీ మరీ చెప్పమన్నారు”…

సినీ, రాజకీయ ప్రముఖులతో వివాహ వేడుక కళకళలాడింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, అల్లు అర్జున్, రామ్ చరణ్, రాఘవేంద్రరావు, శ్రీకాంత్, రాజమౌళి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ,రకుల్‌ ప్రీత్‌సింగ్‌, రాశీ ఖన్నా, ప్రగ్యాజైశా, తెదేపా నేత నారా లోకేష్‌, లక్ష్మీప్రసన్న, నాగచైతన్య, రామ్‌, గోపీచంద్‌, కార్తి, శ్రీకాంత్‌, సుమంత్‌, సుధీర్‌బాబు, ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, సింగీతం శ్రీనివాసరావు, ఎస్‌.ఎస్‌.రాజమౌళి వచ్చారు.తదితర సినీ ప్రముఖులంతా విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు.

ఆయన స్వహస్తాలతో రాసిన ఆహ్వాన పత్రిక కొద్దిరోజులుగా బాగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇక క్రిష్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం బాలకృష్ణతో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అనే సినిమాను తెరకెక్కిస్తోన్న ఆయన సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *