టీటీడీపై చంద్ర‌బాబు పెత్తనమేంటి: సుబ్రమణ్య స్వామి

గిట్టనివారిపై సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఈ సారి దేవాలయాలపై పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానంపై ఆ ప్రభుత్వ పెత్తనం ఏంటని ప్రశ్నించారు ఆయన. దేశంలో ఏ ఆలయాన్నీ మూడేళ్లకు మించి ప్రభుత్వం తన అజమాయిషీలో ఉంచుకోకూడదని, దీనిపై సుప్రీం కోర్ట్‌లో కేసు వేసి గెలుస్తానని సంచలన ప్రకటన చేశారు స్వామి. అంతేకాదు ఆలయాలను నిర్వహించడానికి ధార్మిక సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఎంపీ.

కాగా సుబ్రహ్మణ్య స్వామి చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం వెనుక ఆయన వ్యక్తిగత కారణాలేమీ కనిపించడం లేదు. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ప్రోద్బలంలో ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. స్వరూపానందేంద్ర రీసెంటుగా స్వామితో భేటీ అయ్యారు. గోహత్య రామజన్మభూమి – దేవాలయ భూముల పరిరక్షణ – గంగా ప్రక్షాళన అంశాలపై వారు చర్చించారు. కాగా ఏపీలో దేవాలయ భూములు – సత్రం భూములు కబ్జాకు గురవుతున్నాయని ఆ భూములను అమ్మేస్తూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని… సుబ్రహ్మణ్య స్వామి జోక్యం చేసుకుంటేనే అలాంటి విషయాల్లో ప్రభుత్వానికి అడ్డుకట్ట పడుతుందని స్వరూపానందేంద్ర కోరడంతో ఆయన అంగీకరించినట్లుగా తెలుస్తోంది.  సదావర్తి సత్రం భూముల వ్యవహారం నేపథ్యంలో ఈ రగడ రేగినట్లు తెలుస్తోంది.

కాగా విశాఖ శారదాపీఠం స్వరూపానందకు చంద్రబాబుకు మధ్య చాలాకాలంగా విభేదాలున్నాయి. చంద్రబాబు విధానాలపై స్వరూపానంద చాలాకాలంగా విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే సుబ్రహ్మణ్య స్వామి మాత్రం చంద్రబాబును ముందెన్నడూ టార్గెట్ చేయలేదు. దీంతో స్వరూపానంద పెట్టిన ఫిటింగుల వల్లే సుబ్రహ్మణ్య స్వామి చంద్రబాబుపై దండెత్తినట్లు అనుమానిస్తున్నారు. అయితే.. బీజేపీ – టీడీపీలు మిత్రపక్షాలు కావడంతో బీజేపీ పెద్దలతో చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉండడంతో సుబ్రహ్మణ్య స్వామిని కంట్రోలు చేయడం పెద్ద విషయమేమీ కాదని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *