సన్నీ లియోన్ కు కవలలు

ఒకప్పటి పోర్న్ స్టార్ సన్నీ లియోన్… ఇళ్లు పిల్లలతో సందడిగా మారింది. ఏడాది క్రితం వరకు పిల్లల్లేని ఈ జంటకు… ఒకేసారి ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులైపోయారు. ముగ్గరిలో ఒకరిని దత్తత తీసుకుంటే…. ఇద్దరు సరోగసీ పద్దతిలో జన్మించారు. రెండేళ్ల పాప… ఇద్దరు కవల బాబులతో ఫ్యామిలీ పిక్చర్ కంప్లీట్ చేసింది సన్నీ.

గతేడాది సన్నీ లియోన్… మహారాష్ట్రాకు చెందిన రెండేళ్ల పాపని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమెకు నిషా వెబర్ కౌర్ అని పేరు పెట్టుకున్నారు. అదే విధంగా సరోగసీ ద్వారా కూడా పిల్లలకు ప్రయత్నించారు. అలా అద్దె గర్భం ద్వారా ఇద్దరు మగపిల్లలకు తల్లయ్యింది సన్నీ. ముగ్గురు పిల్లలతో కలిసి ఉన్న ఫోటోని ట్విట్టర్ పోస్టు చేసి… అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లల బాధ్యత తమపై ఉందని ఆనందంగా చెబుతోంది. దేవుడు తమకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడని మురిసిపోతోంది. కవల మగ పిల్లలకు ఆషర్ సింగ్ వెబర్.. నోవా సింగ్ వెబర్ అని పేర్లు పెట్టుకున్నారు. ఆ నటికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

బాలీవుడ్లో సరోగసీ ద్వారా పిల్లలను కనడం చాలా సహజం అయిపోయింది. కేవలం సన్నీనే కాదు… ఆమిర్ ఖాన్-కిరణ్ రావు… షారూఖ్ ఖాన్ – గౌరితో పాటూ అనేక జంటలు ఇలా సరోగసీ బాట పట్టాయి. అద్దె గర్భాలపై మన దేశంలో నియమనియంధనలేవీ కఠినంగా లేకపోవడంతో… ఎక్కువ మంది సరోగసీకి వెళుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *