చావు అంచుల వరకు వెళ్లి ఎస్కేప్ అయిన సన్నీ లియోన్!

మరణం అంచుల వరకు వెళ్లి తృటిలో ప్రాణాలతో బయటపడితే…. ఎలా ఉంటుంది. తాజాగా సన్నీ లియోన్ కు అలాంటి అనుభవమే ఎదురైంది. ఈ అనుభవాన్ని సన్నీ లియోన్ అభిమానులతో పంచుకుంది. తాము విమాన ప్రమాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నామ‌ని, తాము ప్రాణాలతో ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలు చెబుతున్నామ‌ని సన్నీ లియోన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో కూడా పోస్టు చేసారు.

ఫైలట్ వల్లే తాము ప్ర‌యాణిస్తున్న ప్రైవేట్ జెట్ వాతావరణం అనుకూలించని కారణంగా ప్రమాదానికి గురి కాబోయింది, పైలట్ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి త‌మ‌ను ర‌క్షించాడ‌ని సన్నీ లియోన్ తెలిపింది.

మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతంలో మహారాష్ట్రలోని ఓ మారుమూల ప్రాంతంలో విమానం క్రాష్ ల్యాండ్ అయిందని, ఇపుడు అంతా క్షేమంగా ఇంటికి వెళుతున్నామ‌ని చెబుతూ సన్నీ లియోన్ సెల్పీ వీడియో పోస్టు చేసింది. ఈ విమానంలో సన్నీ లియోన్ తో పాటు ఆమె భర్త డేనియల్ వెబర్, మరికొందరు ఉన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *