సాయిధరమ్ తేజ‘సుప్రీమ్‌’ ట్రైలర్ (వీడియో)

సాయిధరమ్‌తేజ్‌, రాశీఖన్నా జంటగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సుప్రీమ్‌’ ఆడియో విడుదలైంది. సాయికార్తీక్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ సందర్బంగా చిత్రం ధియేటర్ ట్రైలర్ ని విడుదల చేసారు.

ఒక చిన్న స్టోరీలైన్ పెట్టుకొని.. దాని చుట్టూ మసాలా సీన్లతో మాంచి ఎంటర్టయిన్మెంట్ అల్లితే ఎలా ఉంటుంది? అచ్చం ”సుప్రీం” సినిమాలా ఉంటుంది. అంతకుముందు ”పటాస్” సినిమా కూడా అంతేగా. అందుకు ఇప్పుడు అదే పద్దతిలో తన రెండో సినిమాను కూడా దర్శకుడు అనిల్ రావిపూడి ఒక మసాలా మూవీగానే డిజైన్ చేశాడు.

సుప్రీమ్ అంటూ తన కారుకు పేరును పెట్టుకుని.. కారు నడుపుకుంటూ ఉంటాడు మన హీరో. ఎవరైనా వెనకొచ్చి హార్న్ కొడితే మాత్రం వారికి హారర్ సినిమాను చూపిస్తాడు. ఈ మాస్ రోల్ లో సాయధరమ్ అదరగొట్టాడు. ఇకపోతే మన హీరోయిన్ బెల్లం శ్రీదేవి గా.. రాశి ఖన్నా చక్కటి కామెడీ టైమింగ్ తోనే కాకుండా.. ఒక గ్లామర్ క్వీన్ గా కూడా ఆకట్టుకుంది. రేసుగుర్రం రవికిషన్ ఒక మ్యాడ్ విలన్ గా.. జిల్ ఫేం కబీర్ దుహన్ సింగ్ ఒక క్లాస్ విలన్ గా ఆకట్టుకున్నారు. యథావిథిగా అనిల్ రావిపూడి మార్కు కామెడీ ఉంది. ఇక సాయి కార్తీక్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగనే ఉంది.

చిరంజీవి తల్లి అంజనాదేవి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, హీరో నాని ముఖ్య అతిథులుగా హాజరై సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్రం యూనిట్ తో పాటు హీరోలు వరుణ్‌తేజ్‌, దర్శకులు వంశీ పైడిపల్లి, హరీశ్‌ శంకర్‌, గోపీచంద్‌ మలినేని తదితరులు హాజరయ్యారు.

పటాస్ సినిమాలో అరె వో సాంబ సాంగ్ ని రీమిక్స్ చేసినట్లుగానే,సుప్రీమ్ సినిమాలో కూడా చిరంజీవి నటించిన యముడుకు మొగడు చిత్రంలోని అందం హిందోళం, అధరం తాంబూళం అనే పాటను రీమిక్స్ చేసారు. ఈ పాటలో కోరస్ సుప్రీమ్ హీరో అని వస్తుంది కాబట్టి టైటిట్ కు తగినట్లు పాట ఉండాలని రీమిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రంలో ఆటో డ్రైవర్‌గా కనిపించనుండగా, రాశీఖన్నా పోలీస్ ఆఫీసర్‌గా అలరించనుంది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ హిట్‌తో తేజు జోష్‌లో ఉండగా, పటాస్ సక్సెస్‌తో అనీల్ మంచి ఊపు మీదున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సుప్రీమ్ చిత్రం ఏ రేంజ్ అంచనాలను అందుకుంటుందో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *