రోజు ఒక గ్లాసు పాలు తాగటం వలన కలిగే ప్రయోజనాలు

రోజు పాలు తాగటం వలన ఎముకలు, కండరాలు దృడంగా మారతాయని మాత్రమే మనకు తెలుసు అవునా! కానీ పాల వలన వివిధ రకాల వ్యాధులు కూడా తగ్గించబడతాయి నమ్మకం కలగటం లేదా! అయితే ఇది చదవండి.

ఆరోగ్యాన్ని సంరక్షించే సహజ ద్రావణంగా పాలను పేర్కొనవచ్చు, కాల్షియం, పాస్పరస్, మరియు విటమిన్ ‘D’ వంటి అనేక పోషక విలువలను పాలు కలిగి ఉంటాయి. కండరాల, దంతాలు మరియు ఎముకలు దృడంగా ఉండటంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇంతేకాకుడు పాల వలన ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.

గుండె వ్యాధులకు దూరం

కాల్షియం మూలకాన్ని ఎక్కువగా కలిగి ఉండే పాలను రోజు తాగే వారు చాలా తక్కువగా హృదయ సంబంధిత వ్యాధులకు గురవుతారని మరియు అసలే తాగని వారు ఎక్కువగా గుండె వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని పరిశోధనలలో తెలుపబడింది. పాలలో ఉండే కాల్షియం శరీరంలో ఉండే చెడు (LDL) కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గిస్తుందని మరియు (HDL) మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుందని పరిశోధనలలో తెలుపబడింది.

మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది

ఇటీవల జరిపిన పరిశోధనలలో 37,000 మంది నడి వయసు గల స్త్రీలు రోజు తక్కువ ఫ్యాట్ కలిగిన పాలను తాగి, టైప్-2 మధుమేహ వ్యాధి గురయ్యే అవకాశాలు చాలా వరకు తక్కువని ఇటీవల జరిపిన పరిశోధనలలో తెలుపబడింది. తక్కువ ఫ్యాట్ గల కొవ్వు పాలలో గ్లైసిమిక్ స్థాయిలు తక్కువగా ఉండటం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు సాధరణ స్థాయిలో ఉండటమే దీనికి కారణమని వారు తెలిపారు

కోలన్ మరియు బ్రెస్ట్ కేన్సర్ ను నివారిస్తుంది

పాలు తాగని వారితో పోలిస్తే రోజు 1.5 గ్లాసుల పాలు తాగే 45,000 మంది స్వేడిష్ పురుషులలో కేన్సర్ కు గురయ్యే అవకాశాలు దాదాపు 35 శాతం తగ్గిందని ఇటీవల జరిగిన పరిశోధనలలో పేర్కొనబడింది. చిన్నప్పటి నుండి పాలు తాగే అలవాటు ఉన్న వారిలో రొమ్ము కేన్సర్ కలిగే అవకాశాలు ఆడపు తక్కువే అని పరిశోధనలలో తెలుపబడింది. పాలలో ఉండే కాల్షియం మరియు సహజ రూపంలో ఉండే కొవ్వు (లినోయిక్ ఆసిడ్) కేన్సర్ వ్యాధికి వ్యతిరేఖంగా పోరాడుతుందని తెలిపారు

ఊబకాయాన్ని తగ్గించే పాలు

పాలు తాగటం వలన శరీర బరువు గణనీయంగా పెరుగుతుందని చాలా మంది నమ్మకం. ఇదొక అపనమ్మకం మాత్రమే. నిజానికి రోజ్ పాలు తాగే వారిలో బరువు పరిమితిలో ఉంటుంది. అది కూడా తక్కిఉవ ఫ్యాట్ గల కొవ్వు పదార్థాలను తాగే వారు ఊబకాయానికి గురవటం చాలా అరుదు.

 

Videos

4,412 thoughts on “రోజు ఒక గ్లాసు పాలు తాగటం వలన కలిగే ప్రయోజనాలు