ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ మూడు జిల్లాలు జగన్‌వే!

ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే, 2014 ఎన్నికల కన్నా మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి మరోసారి అధికారంలోకి వస్తుందని ఆ తెలుగు న్యూస్ ఛానల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ-బీజేపీ కూటమికి 120 స్థానాలు, వైసీపీకి 50 స్థానాలు వస్తాయని ఈ సర్వేలో తేలింది. అయితే, జగన్‌కు పట్టున్న జిల్లాల్లో టీడీపీకి మళ్లీ ఎదురుగాలే వీస్తుందని పల్స్ పోల్ సర్వేలో వెల్లడైంది.

వైసీపీ కంచుకోట కడపలో మళ్లీ వైసీపీకే ప్రజలు పట్టం కట్టనున్నారు. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో కూడా జగన్ పార్టీకే జనం జై కొడుతున్నారు. చిత్తూరు జిల్లాలో మాత్రం టీడీపీ, వైసీపీ నువ్వేనేనా అన్నట్టుగా తలపడే అవకాశాలున్నట్లు తేలింది. అయితే, ఈ సర్వే కేవలం ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించేందుకు చేసిన ఓ ప్రయత్నం మాత్రమే. ఈ సమీకరణాలే 2019లో జరగబోయే ఎన్నికల వరకూ కొనసాగుతాయని కచ్చితంగా చెప్పలేం. టీడీపీ ఈ రెండున్నరేళ్లలో అభివృద్ధి చూపిస్తే వైసీపీ పట్టున్న జిల్లాల్లో కూడా టీడీపీ ప్రాభవాన్ని చాటుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Videos

Leave a Reply

Your email address will not be published.