ఊహకందని ట్విస్టులు అపరిమితమైన వినోదం -“24” ప్రివ్యూ టాక్

అమెరికాలో నిన్న వేసిన సూర్య తాజా సినిమా 24 ప్రీమియర్ షోలకు అమెరికాలోని తెలుగువారు బ్రహ్మరథం పట్టారని తెలుస్తుంది. అమెరికాతో పాటు పలుచోట్ల వేసిన ఈ ప్రీమియర్ షోలకు విపరీతమైన స్పందన వచ్చింది. తాజా సమాచారం ప్రకారం 24 సినిమాపై పాజిటివ్ టాక్ వచ్చిందని తెలుస్తుంది. ఇటువంటి కథతో ఇప్పటివరకు సినిమా ఎవరు సినిమా చేయడానికి ప్రయత్నం చేయలేదని, ఈ సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఊహకు అందలేదని, ఈ ప్రీమియర్ షోను చూసిన ప్రేక్షకుల స్పందన అని సమాచారం.

యాక్షన్, డ్రామా, రోమాన్స్, సెంటిమెంట్ సమపాళల్లో కుదిరిందని, మొత్తమీద 24 సినిమా సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని ఓవర్సీస్ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రముఖ బాలీవుడ్ సినీ విమర్శకుడు, తరుణ్ ఆదర్శ్ 24 ప్రివ్యూ షో చూసి సినిమాపై ప్రశంసలన వర్షం కురిపించాడు. అంతేకాదు…24 లాంటి సినిమా తీయాలంటే ఎంతో దైర్యం, నిబద్దత, సినిమాపై పట్టు ఉండాలని షాకింగ్ కామెంట్ చేశాడు.

ఈసినిమా 2 గంటల 40 నిమిషాల పాటు ఉన్న ఎక్కడా బోర్ అన్నది రాదనీ ఈ సినిమా కథలో ప్రేక్షకుడు లీనమై పోతాడని ఊహకందని ట్విస్టులు అపరిమితమైన వినోదంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకుడు ఒక వింత అనుభూతిని పొందుతాడని తరణ్ ఆదర్స్ అభిప్రాయ పడ్డాడు. ఈసినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు క్లైమాక్స్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ గా మారుస్తుందని అభిప్రాయ పడుతున్నాడు తరణ్ ఆదర్శ్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *