ప్రియుడితో సుస్మిత సేన్ హాట్ హాట్ ఫోటోస్

Sushmita Senబాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ తన ప్రియుడు రోహ్మన్ షాల్‌తో కలిసి విహారయాత్ర సమయంలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కుమార్తె రెనీ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకునేందుకు సుస్మిత రోహ్మన్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లారు. మోడల్ రోహ్మన్ షాల్‌ తో దాదాపు ఏడాదిగా సుస్మిత డేటింగ్‌లో ఉన్నారు. కాగా ఇటీవల ఇద్దరూ విహారయాత్ర నిమిత్తం మాల్దీవ్స్‌ కు వెళ్లారు. అక్కడి బోట్ రైడింగ్‌లో సుస్మిత బికినీ వేసుకుని రోహ్మన్ ఒడిలో వాలిపోయినప్పుడు తీసిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సుస్మిత దత్తత కూతురు రెనీ పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసేందుకు సుస్మిత రోహ్మన్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లారు. అక్కడ వీరిద్దరూ కలిసి దిగిన హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

dc-Cover-25abfmpm55ssdcm8pp6q72jal0-20190916120607.originalఓ ఫ్యాషన్ షోలో సుస్మిత, రోహ్మన్ కలిసి ర్యాంప్ వాక్ చేశారని, అక్కడే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని వార్తలు వచ్చాయి. ఓసారి ఇన్‌స్టాగ్రామ్‌లో రోహ్మన్ తనుకు డైరెక్ట్ మెసేజ్ చేశారట. కానీ సుస్మిత ఆ మెసేజ్‌ను చూసుకోలేదు. ఓసారి తనకు వచ్చిన మెసేజ్‌లను సుస్మిత చెక్ చేశారు. అలా రోహ్మన్ గురించి తెలిసింది. తొలిసారి రోహ్మన్‌ని చూడగానే తనకు బాగా పరిచయం అయిన వ్యక్తి అనిపించాడని సుస్మిత తెలిపారు. అయితే వీరిద్దరూ 2020లో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం సుస్మిత ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకున్నారు. వారిద్దరూ రోహ్మన్‌ను తండ్రిగా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారు చదువుకునే స్కూల్లో ఏవైనా స్పోర్ట్స్ లాంటివి జరిగితే ఓ తండ్రిగా రోహ్మన్ స్కూల్ ఈవెంట్స్‌కు హాజరవుతున్నారు. సుస్మిత విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్నారన్న మాటే కానీ ఆమె కెరీర్ మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. పలు విజయవంతమైన సినిమాల్లో నటించినప్పటికీ సినిమా రంగంలో యాక్టీవ్‌గా ఉండేలేకపోయారు. అందుకే రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ మరోపక్క సొంత వ్యాపారాలను చూసుకుంటున్నారు.

_70fb5f82-d857-11e9-b2f8-83b44344bbe7

Capture.PNG1

Videos