ఆ యాంకర్ చూపు.. సినిమాల వైపు

ప్రస్తుతం బుల్లితెరపై సూపర్బ్ క్రేజ్ ఉన్న యాంకర్లలో శ్యామల పేరు ఖచ్చితంగా ఉంటుంది టీవీ షోలతో మాత్రమే కాకుండా.. తన లుక్స్ తో కూడా ఆకట్టుకోవడం ఈమె స్పెషాలిటీ. మరోవైపు పలు సినిమాల ఆడియో ఫంక్షన్స్ ను కూడా హోస్ట్ చేస్తూ.. కుర్రాళ్లు బాగా నోటెడ్ అయిపోయింది ఈ భామ. ప్రస్తుతం బుల్లితెరపై తన కెరీర్ లోనే పీక్ స్టేజ్ లో ఉండడంతో.. ఆ నెక్ట్స్ స్టెప్ కి వెళ్లేందుకు బాగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

క్రేజ్ ఉండగానే కెరీర్ ని దిద్దుకోవాలనే ఆలోచన చేయడం ఇప్పుడే కాదు ఎప్పుడైనా జరిగేదే.. ఇప్పుడూ జరుగుతున్నదే. ఇప్పటికే పలు భారీ చిత్రాల ఆడియో ఫంక్షన్స్ లో కూడా సందడి చేయడంతో.. సినీ జనాలకు బాగానే నోటెడ్ అయిపోయింది. ఇదే ఊపులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేయాలన్నది అమ్మడి ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే అనసూయ.. ఝాన్సీ లాంటి యాంకర్లు చూపిన బాటలో నడవాలని భావిస్తోందట శ్యామల.

లుక్స్ పరంగా మంచి మార్కులే ఉండడం.. ఇప్పటికే ఫ్యామిలీ జనాల్లో ఫుల్లు క్రేజ్ ఉండడంతో యాంకర్ శ్యామలకు యాక్టర్ శ్యామలగా మారిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటున్నారు సిని జనాలు.

Videos

353 thoughts on “ఆ యాంకర్ చూపు.. సినిమాల వైపు

Leave a Reply

Your email address will not be published.