ట్రైలర్ రికార్డ్..సైరా నరసింహారెడ్డి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక  సినిమా సైరా నరసింహారెడ్డి తెలుగు ట్రైలర్‌ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో విడుదల చేశారు. 3 నిమిషాల నివిడి ఉన్న ఈ ట్రైలర్‌ తమ అంచనాలకు తగినట్టుగా ఉండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది.

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’లో చిరంజీవి టైటిల్‌ రోల్‌ పోషించారు. కోణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై హీరో రామ్‌చరణ్‌ ఈ సినిమాను నిర్మించగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. అమితాబ్‌ బచ్చన్, జగపతిబాబు, సుదీప్‌, రవికిషన్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. అక్టోబర్‌ 2న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది.

Videos