రాఘవేంద్రరావును దారుణంగా అవమానించిన తాప్సీ..

రాఘవేంద్రరావును ఇప్పటి వరకు ఎలాంటి హీరోయిన్ ఒక్క మాట అనలేదు. కానీ తాప్సీ మాత్రం రాఘవేంద్రరావును బాలీవుడ్‌లో ఓ టెలివిజన్ చర్చా కార్యక్రమంలో బట్టలిప్పినంత పనిచేసింది. దర్శకేంద్రుడిపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశమైంది. రాఘవేంద్రరావు టార్గెట్ చేస్తూ ఆయన పేరు ఎత్తకుండానే తాప్సీ అన్నదేమిటంటే..

సినిమా రంగానికి పరిచయం చేసిన దర్శకుడికి అప్పటికే పరిశ్రమలో గొప్ప పేరుంది. ఆయన పరిచయం చేసిన వారు అగ్రతారలుగా మారారు. శ్రీదేవి, జయసుధను ఆయనే పరిచయం చేశారు. నా తొలి చిత్రం ఆయనకు 105వ చిత్రం.

హీరోయిన్లను అత్యంత శృంగారంగా చూపించడం ఆయన స్టయిల్. హీరోయిన్ల బొడ్డు మీద పూలు, పండ్లను విసిరివేయడం ఆయన ప్రత్యేకత. నా తొలి చిత్రమే అలాంటి దర్శకుడితో పనిచేయడం గొప్ప అవకాశం అనుకొన్నాను. నేను కూడా బొడ్డు మీద పూలు, పండ్లు వేయించుకోవడానికి రెడీ అయ్యాను. దానికి ముందు ఆయన శ్రీదేవి, జయసుధ, ఇతర హీరోయిన్లతో తీసిన సినిమాలు చూశాను.

ఇక ఆ చిత్రంలో పూలతో కొట్టించుకోవచ్చనే అనుకొన్నాను. నా వంత వచ్చిందని సంతోషిస్తుండగానే ఆయన దేనితో కొట్టాడో చెప్తే కంగు తింటారు. నా బొడ్డు మీద కొబ్బరి చిప్పతో కొట్టాడు. నాకు అప్పుడు అర్థం కాలేదు. నా బొడ్డుపై కొబ్బరి చిప్పతో కొట్టడం ఏం శృంగారమో అర్థం కాలేదు అని చెప్పగానే ఆ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు, ఆడియెన్స్ పడిపడి నవ్వారు.

తాప్సీ చెప్తుండగానే ఝుమ్మంది నాదం చిత్రంలోని పాటకు సంబంధించిన క్లిప్పింగ్‌ను వెనుక ఉన్న టెలివిజన్‌లో ప్రదర్శించారు. ఆ పాటలో తాప్సీ బొడ్డు మీద కొబ్బరి చిప్పతో కొట్టి ఆ తర్వాత ఓ పువ్వును వేస్తారు. ఆ కొబ్బరి చిప్పలోని పువ్వును మనోజ్ నోటితో తీసుకొని తాప్సీ పెదవులపై పెట్టి ముద్దు పెట్టుకొంటాడు.

ఈ సన్నివేశాన్ని చూపిస్తుండగా ఆడియెన్స్‌తోపాటు చర్చావేదికలో పాల్గొన్నవారంతా పడిపడి నవ్వాడు. తెలిసో తెలియకో తాప్సీ మాత్రం రాఘవేంద్రరావు పరువును జాతీయ స్థాయిలో గంగలో కలిపింది. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతున్నది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *