స్పెషల్స్: బిగ్ బాస్ లో రానున్న తాప్సీ

జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో రేటింగ్స్ మెల్లగా పరుగులు తీస్తున్నాయి. తారక్ వచ్చేది కేవలం రెండు రోజులే కాబట్టి మిగిలిన ఐదు రోజులు ప్రేక్షకులు పక్క ఛానల్ కు వెళ్ళకుండా చేయటం కత్తి మీద సాములా మారింది నిర్వాహకులకు. అందుకే వీలైతే కొన్ని మసాలాలు వేయడానికి కూడా వెనుకాడటం లేదని నిన్న ఎపిసోడ్ బట్టి అర్థమయ్యింది.

ఇక మెల్లగా బిగ్ బాస్ లో సినిమా సెలెబ్రిటీల హంగామా కూడా స్టార్ట్ చేయబోతున్నారు. లాస్ట్ వీక్ నేనే రాజు నేనే మంత్రి హీరో రానా స్పెషల్ గెస్ట్ గా బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయటం చూసాం కదా. నిజానికి అది సినిమాకి హెల్ప్ అయ్యిందేమో కాని షో కి రేటింగ్ పరంగా పెద్దగా ఉపయోగపడలేదు. అందుకే ఇంకొందరిని తెచ్చే ప్రయత్నంలో పడింది స్టార్ మా. అందులో భాగంగా వారం వారం విడుదల అవుతున్న కొత్త సినిమాలలో ఉన్న స్టార్స్ తమ షో లో పార్టిసిపెట్ చేసేలా రమ్మని పిలుస్తున్నారట.

రానా తర్వాత ఈ వీక్ బిగ్ బాస్ హౌస్ తాప్సీ సందడి చేయనుంది. తను నటించిన ఆనందో బ్రహ్మ రేపు విడుదల కానుంది. సోలోగా బరిలో దిగుతున్న ఈ మూవీపై అంచనాలు పెద్దగా లేకపోవడమే ప్లస్ అవుతుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. అందుకే ప్రమోషన్ చాలా ప్లానింగ్ తో చేస్తున్నారు. ఇక తాప్సీ ఒక వినూత్నమైన కొత్త రకం గెటప్ తో బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుందట.

ఇలా రియాలిటీ షోలలో సినిమా సెలెబ్రిటీస్ వచ్చి హడావిడి చేయటం బాలీవుడ్ లో కామన్ కాని టాలీవుడ్ లో మాత్రం ఈ మధ్యే స్టార్ట్ అయ్యింది. వచ్చే వారం అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండను కూడా  లైన్ లో పెట్టారట. కాని అతని నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందో లేదో మాత్రం కన్ఫర్మ్ కాలేదు. మొత్తానికి బిగ్ బాస్ ని కలర్ఫుల్ గా మార్చడానికి ఎన్ని చేయాలో అన్ని చేస్తోంది స్టార్ మా ఛానల్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *