ఎమ్మెల్యేగా తార‌క‌ర‌త్న‌..? పోటీ ఎక్క‌డో తెలుసా…?

నంద‌మూరి ఫ్యామిలీ నుంచి ఇప్ప‌టికే నంద‌మూరి బాల‌కృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఫ్యామిలీ నుంచి ఇప్ప‌టికే దివంగ‌త మాజీ సీఎం, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు అయిన సీనియ‌ర్ ఎన్టీఆర్ త‌ర్వాత ఆయ‌న పెద్ద కుమారుడు హ‌రికృష్ణ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా ప‌నిచేశారు. త‌ర్వాత ఆయ‌న రాజ్య‌స‌భ‌కు కూడా వెళ్లారు. ఆ త‌ర్వాత గ‌త ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్ మ‌రో కుమారుడు బాల‌కృష్ణ సైతం హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.

హిందూపురంలో బాల‌య్య వివిద అభివృద్ధి ప‌నులు చేస్తూ అక్క‌డి ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాలు సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ క్ర‌మంలోనే మ‌రో నంద‌మూరి హీరో సైతం అసెంబ్లీ వైపు చూస్తున్నార‌న్న టాక్ ఏపీ పాలిటిక్స్‌లో వినిపిస్తోంది. ఆ హీరో ఎవ‌రో కాదు నంద‌మూరి తార‌క‌ర‌త్న‌.

2002లో ఒక‌టో నెంబ‌ర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అంత‌గా స‌క్సెస్ కాలేక‌పోయాడు తార‌క‌ర‌త్న‌. ఆ త‌ర్వాత విల‌న్‌గా మారిన తార‌క‌ర‌త్న అక్క‌డ ఒక‌టి రెండు స‌క్సెస్‌లు సొంతం చేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే తార‌క‌త‌ర్న ఇప్పుడు పాలిటిక్స్‌లోకి వెళ్లాల‌ని చూస్తున్నాడ‌ట‌. తార‌క‌ర‌త్న 2009, 2014 ఎన్నిక‌ల్లో టీడీపీకి ప్ర‌చారం కూడా చేశాడు. వ‌చ్చే 2019లో పొలిటిక‌ల్ గా కూడా త‌న అదృష్టాన్ని ప‌రిశీలించుకుందామ‌ని మ‌నోడు ప్ర‌య‌త్నాలు అప్ప‌డే ప్రారంభించాడ‌ట‌.

గుంటూరు జిల్లా నుంచి పోటీ..?
2019 ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల‌నుకుంటోన్న తార‌క‌ర‌త్న గుంటూరు జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ట‌. తార‌క‌ర‌త్న గ‌త రెండు ఎన్నికల్లోను గుంటూరు – కృష్ణా జిల్లాల్లో టీడీపీ త‌ర‌పున అభ్య‌ర్థుల గెలుపుకోసం ప్ర‌చారం చేశాడు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే ఓకే..లేనిప‌క్షంలో ఏదో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేను త‌ప్పిస్తే త‌ప్ప తార‌క‌ర‌త్న‌కు సీటు రాదు. మ‌రి బాబు మ‌రోవైపు త‌న కుమారుడు లోకేష్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల బ‌రిలో దింపాల‌నుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో తార‌క‌ర‌త్న‌కు కూడా ఓకే చెపుతారా ? ఆయ‌న‌కు ఎమ్మెల్యే సీటు ఇస్తారా ? అన్న ప్ర‌శ్న‌ల‌కు కాల‌మే స‌మాధానం చెప్పాలి.
Videos

350 thoughts on “ఎమ్మెల్యేగా తార‌క‌ర‌త్న‌..? పోటీ ఎక్క‌డో తెలుసా…?

Leave a Reply

Your email address will not be published.