ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇకలేరు

తెదేపా సీనియర్ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇకలేరు. ఆయన హైదరాబాద్ లోని బసవతారం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. ఇవాళ ఉదయం తీవ్ర గుండె పోటు రావడంతో ఆయనను వెంటనే కుటుంబ సభ్యులు బసవతారం హాస్పిటల్ కు తరలించారు.  కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయిన ఫలితం దక్కలేదు.

మరివైపు కోడెల ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని ప్రచారం జరుగుతుంది. అయితే గుండెపోటుతోనే మరణించారని ఆయన వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. కానీ మరివైపు ఒత్తిళ్ళ కరణంగానే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన అనుచరులు చెబుతున్నారు. కానీ ఆయన గుండెపోటుతోనే హాస్పిటల్లో చేరాడని హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి.

Videos