జగన్ పాదయాత్రను ఆపేందుకు కొత్త ఎత్తుగడ..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై మళ్లీ సీబీఐ ద్వారా ఒత్తిడి పెంచేందుకు పాలక పక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. క్రితం సారి కాంగ్రెస్ వాళ్లు తమకు ఎదురుతిరిగాడనే మిషతో జగన్ పై కుట్రపూరితంగా కేసులు పెట్టించి.. పదహారు నెలల పాటు జైల్లో పెట్టించి.. కేసుల నట్లు బిగించగా, ఇప్పుడు అధికార పార్టీ తన పరపతిని ఉపయోగించుకుని జగన్ ను తిప్పలు పెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిందనే వార్తలు వస్తున్నాయి. జగన్ తన రాజకీయ కార్యకలాపాలను ముమ్మరంగా సాగించడాన్ని సహించలేకపోతున్న తెలుగుదేశం ప్రభుత్వం తనకున్న పరపరితో జగన్ కు అడ్డంకులు వేయడానికి ప్రయత్నాలు ఆరంభించినట్టు సమాచారం.

జగన్ అక్టోబర్ నుంచి పాదయాత్రను చేపడతానని ప్రకటించిన నేపథ్యంలో.. ఇప్పుడిప్పుడే సీబీఐ కదలికలు కూడా ముమ్మరం కావడం విశేషం. జగన్ ను తిరిగి జైల్లో పెట్టలేకపోయినా.. జగన్ కార్యకలాపాలకు బ్రేక్ వేయడానికి మాత్రం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రత్యేకించి జగన్ పై నమోదైన కేసుల్లో ప్రత్యేక ట్రయల్స్ పేరుతో ఇక వరసగా విచారణలు నిర్వహించనున్నారట.

వాటికి వ్యక్తిగత హాజరీ నుంచి జగన్ మోహన్ రెడ్డికి మినహాయింపును ఇవ్వకుండా వ్యవహారాన్ని నడిపించాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కోర్టుల్లో చంద్రబాబుకు ఉన్న పరపతి గురించి వివరించనక్కర్లేదు. బాబుపై కేసులకు కోర్టు దగ్గర విలువ ఉండదు, అలాగే బాబు వ్యతిరేకులు కోర్టు దగ్గర చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా ఖాయమే. ఈ క్రమంలోనే జగన్ విషయంలో విచారణ సాగుతోందనే విశ్లేషణ వినిపిస్తోంది.

మరి జగన్ ఇప్పటికే పాదయాత్రను చేపడతాను అని ప్రకటించాడు. ఇలాంటి ఇబ్బందులను జగన్ ఊహించి ఉండడా? ఊహించకుండానే అలా ప్రకటించడు కదా.. ఈ రకంగా చూస్తే.. జగన్ ప్రణాళిక అతడికి ఉండవచ్చు. అదేమిటనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

Videos

17 thoughts on “జగన్ పాదయాత్రను ఆపేందుకు కొత్త ఎత్తుగడ..?

Leave a Reply

Your email address will not be published.