ఏ దేశంలో లేని వనరులు రష్యాలో ఉన్నాయి

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది.. సమావేశంలో పాల్గొన్న బీజేపీ, టీడీపీ ఎంపీలు… రేపు ఢిల్లీలో జరిగే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశంపై చర్చ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారానికి ఏపీ సిద్ధంగా ఉందని కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు చంద్రబాబు.. హైకోర్టు విభజన వివాదం కూడా సమరస్య పరిష్కారానికి సంసిద్ధత తెలియజేయాలని సమావేశంలో నిర్ణయం…విభజన చట్టంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరిచాలని కౌలన్సిల‌్ సమావేశంలో ప్రస్తావించాలని నిర్ణయించినట్టు సీఎం తెలిపారు …

అనంతరం రష్యాపర్యటన గురించి సీఎం మీడియాతో ముచ్చటించారు… ఏ దేశంలో లేని వనరులు రష్యాలో ఉన్నాయని… సాంకేతిక పరిజ్ఞానంలో రష్యా చాలా ముందందన్నారు.. ఏపీకి కూడా అలాంటి పేరు తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు, భారత్ రష్యాలకు మంచి సంబంధం ఉందని సీఎం గుర్తు చేశారు…ఈ రష్యా పర్యటనలో ఆ దేశంతో కీలకమైన ఎంవోయూను కుదుర్చుకున్నామన్నారు.. రష్యా పారిశ్రామిక వేత్తలు ఏపీకి వస్తామన్నట్టు సీఎం వివరించారు.. పర్యటనలో కిజికిస్థాన్ చూసి రమ్మని ప్రధాని చెప్పనట్టు చంద్రబాబు చెప్పారు.

Videos

3 thoughts on “ఏ దేశంలో లేని వనరులు రష్యాలో ఉన్నాయి

Leave a Reply

Your email address will not be published.