రోజాకు టీడీపీ ఆఫ‌ర్ తెలిస్తే షాకే

వైకాపా లేడీ ఫైర్‌బ్రాండ్‌, ఆ పార్టీ న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్‌కె.రోజా అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు స‌స్పెండ్ అయినా ఆమె ప్ర‌వ‌ర్త‌నా తీరు మాత్రం

మార్చుకోవ‌డం లేదు. ఈ విష‌యంలో సుప్రీంకోర్టు వ‌ర‌కు వెళ్లినా కూడా ఆమె దూకుడు మాత్రం త‌గ్గ‌డం లేదు. తాజాగా మ‌రోసారి చంద్ర‌బాబు, టీడీపీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసి ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు చేస్తోన్న రోజాకు టీడీపీ ఓ ఆఫ‌ర్ ఇచ్చింది. ఈ షాకింగ్ ఆఫ‌ర్ మ్యాట‌ర్ ఏంటో చూద్దాం.

రోజాపై సాంఘిక సంక్షేమ శాఖ – గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్ బాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. అవాకులు – చెవాకులతో రోజుకో విమర్శ చేస్తూ రోజా అనవసరంగా నోరు పారేసుకుంటోందని విమర్శించారు. ఎక్క‌డో యూపీలో తండ్రికొడుకులు ములాయం – అఖిలేశ్ మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగితే దానికి ఏపీలో చంద్ర‌బాబు-లోకేశ్‌కు లింకు పెట్టి మాట్లాడ‌డం స‌రికాద‌ని ఆయ‌న అన్నారు.
రోజా మాట‌లు చూస్తుంటే ఆమె మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతోందని రావెల వ్యాఖ్యానించారు. రోజా ఏదైనా మానసిక ఆసుపత్రిలో చెక్ చేయించుకోవాలన్న ఆయ‌న ఆమెకు త‌మ స‌హాయంగా ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద మానసిక వ్యాధికి ఉచితంగా చికిత్స చేయిస్తామని రావెల ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో రోజా ప్రవర్తనపై మహిళా సమాజం సిగ్గుతో తలదించుకుందన్న ఆయ‌న రోజా ఇప్ప‌టికి అయినా త‌న తీరు మార్చుకోక‌పోతే ఆమెకు త‌గిన బుద్ధి చెపుతామ‌న్నారు.
Videos

Leave a Reply

Your email address will not be published.