మాల్యాకు మొహం చాటేసిన ఇండియ‌న్ టీమ్‌!

బ‌్యాంకుల‌కు వేల కోట్లు ఎగ‌నామం పెట్టి లండ‌న్ చెక్కేసిన వ్యాపార‌వేత్త విజ‌య్‌మాల్యా ఇప్పుడు టీమిండియా వెంట ప‌డ్డాడు. మొన్న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ను ద‌ర్జాగా వీఐపీ గ్యాల‌రీలో నుంచి చూసిన మాల్యా.. తాజాగా ఇండియ‌న్ టీమ్ వెళ్లిన చారిటీ డిన్న‌ర్‌కు వ‌చ్చాడు. అయితే అత‌ని రాక‌ను ముందే తెలుసుకున్న టీమ్ ప్లేయ‌ర్స్‌.. మాల్యాకు దూరంగా ఉన్నారు. అన‌వ‌స‌రం వివాదం ఎందుకు అనుకొని.. కాస్త ముందుగానే అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఈ ప్రోగ్రామ్‌కు మాల్యా.. స్టైల్‌గా సిగ‌రెట్ తాగుతూ వ‌స్తున్న వీడియో కూడా నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది. మాల్యా రావ‌డంతో కోహ్లితోపాటు మిగ‌తా ప్లేయ‌ర్స్ ఇబ్బంది ప‌డిన‌ట్లు బీసీసీఐ చెప్పింది.

అస‌లు ట్విస్ట్ ఏంటంటే.. ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది విరాట్ ఫౌండేష‌నే. కానీ అత‌నుగానీ, ఫౌండేష‌న్‌గానీ పిల‌వ‌కుండానే మాల్యా అక్క‌డికి రావ‌డం విశేషం. అయితే ఇలాంటి చారిటీ డిన్న‌ర్స్‌లో టేబుల్‌ను బుక్ చేసుకున్న వ్య‌క్తులు త‌మ అతిథుల‌ను పిలిచే వీలుంటుంది. అలా ఎవ‌రో మాల్యాను ఇన్‌వైట్ చేసి ఉంటారు అని బీసీసీఐ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. వ‌చ్చిన గెస్ట్‌ను వెళ్లిపోవాల‌ని చెప్పడం స‌రికాద‌ని టీమే అక్క‌డి నుంచి ముందుగా వెళ్లిపోయింది. ఇండోపాక్ మ్యాచే కాదు.. ఇండియా ఆడే ప్ర‌తి మ్యాచ్ చూస్తాన‌ని ఇప్ప‌టికే మాల్యా ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే.

Videos

Leave a Reply

Your email address will not be published.