‘జాలి’ బీచ్ లో కోహ్లీసేన

team_india_jolly_beach_2రేపటి నుంచి వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ మొదలుకానున్న నేపథ్యంలో కోహ్లీ సేన ఒత్తిడిని పక్కన పెట్టి బీచ్‌లో కొద్దిసేపు సరదాగా గడిపింది. ఆగస్టు 3 నుంచి విండీస్‌ పర్యటనలో బిజీబిజీగా ఉన్న కోహ్లీ సేన ‘జాలీ’ బీచ్‌లో సందడి చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె, రోహిత్‌ శర్మ, ఇషాంత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్, రిషభ్‌ పంత్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మయాంక్ అగర్వాల్‌, సహాయ సిబ్బంది బీచ్‌లో జాలీగా ఎంజాయ్‌ చేశారు. దీనికి సంబంధించిన చిత్రాలను కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచాడు. ‘బీచ్‌లో ఆటగాళ్లతో ఇదో ఓ అద్భుతమైన రోజు’ అంటూ ట్యాగ్‌ చేశాడు. దీంతో కోహ్లీ సేన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టీ20, వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా రేపటి నుంచి ఆంటిగ్వాలో విండీస్‌తో తొలి టెస్టును ఆడనుంది. ఈ సిరీస్‌తోనే ఇరుజట్లకు టెస్టు ఛాంపియన్‌షిప్‌ మొదలవ్వడంతో ఇది ఎంతో కీలకం కానుంది.

Videos

One thought on “‘జాలి’ బీచ్ లో కోహ్లీసేన

  • November 15, 2019 at 9:06 am
    Permalink

    Thank you so much for providing individuals with an exceptionally memorable opportunity to read critical reviews from this blog. It is always so amazing plus stuffed with a good time for me personally and my office peers to search your web site at the very least three times per week to read the latest stuff you have got. And indeed, we are always amazed for the exceptional things you serve. Certain 1 points in this posting are completely the finest we’ve had.

Leave a Reply

Your email address will not be published.