నేటి నుంచే ఆసియా కప్

ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌లో టైటిల్‌ ఫేవరెట్‌గా ముద్రపడిన టీమ్‌ఇండియా.. ఆసియా కప్‌ సాధించి పూర్తి విశ్వాసంతో మెగా టోర్నీ బరిలో దిగాలని పట్టుదలగా ఉంది. నిరుడు తమపై వన్డే సిరీస్‌ అందించిన విజయ గర్వంతో ఉన్న బంగ్లాదేశ్‌ను.. బుధవారం ఓడించి టోర్నీలో శుభారంభం చేయాలని కోరుకుంటోంది.

లీగ్ దశ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరగనున్నందునా, టీమ్ ఇండియాకు ప్రతీ మ్యాచ్ కీలకమే. అందుకే ఆది నుంచే ఆధిపత్యం ప్రదర్శిస్తూ వెళ్తే ఫైనల్ బెర్త్ మనదే. బంగ్లానూ తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. సొంతగడ్డపై వారి పసికూనల్లాకాక సింహాల్లా ప్రత్యర్థిపై విరుచుకుపడతారు. ఈ మధ్య జింబాబ్వేతో సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్నా, ప్రయోగాలతో అన్ని విధాలా సమాయత్తమైంది. పైగా మీర్పూర్‌లో వారిది తిరుగులేని ఆధిపత్యం. భారత్‌తో ఇక్కడ 2014లో జరిగిన మ్యాచ్‌లో 106 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో విఫలమైన తర్వాత కసితో ఆడింది బంగ్లా. ఆ తర్వాత ఇక్కడి ఆడిన 19 మ్యాచ్‌ల్లో 14 విజయాలు సాధించింది. లంకకు చెందిన కోచ్ చండిక హతురసింగ ఆటగాళ్ల నైపుణ్యంపై, పరిమిత ఓవర్ల క్రికెట్లో జట్టు విజయాలపై ప్రధానంగా దృష్టి సారించి ముందుకు నడిపిస్తున్న

మ్యాచ్‌కు ముందు రోజు ప్రాక్టీస్ సెషన్‌లో సహ ఆటగాళ్లతో ఫుట్‌బాల్ ఆడడం ధోనీ అలవాటు. కానీ ఈసారి మాత్రం ధోనీ ప్రాక్టీస్ సెషన్‌లో జట్టుతో ఉన్నాడు కానీ సాధన చేయలేదు. దీంతో తుది జట్టులో ధోనీ ఉంటాడా, లేదా అన్నదానిపై అనుమానాలు నెలకొన్నాయి. ధోనీ గాయానికి గురవడంతో ముందుజాగ్రత్తగా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్‌ను హుటాహుటినా బంగ్లాకు పిలిపించారు. అయితే ధోనీ మరీ ఆడలేని స్థితిలో ఉంటేనే పార్థివ్ తుది జట్టులో చేరే చాన్సుంది. మానసికంగా, శారీరికంగా పార్థివ్ ఈ సిరీస్‌కు సిద్ధమవకపోవడం ఓ కారణమైతే, అతను టీ20 ఫార్మాట్‌కు తగ్గ ఆటగాడు కాకపోవడం, ధోనీ స్థానంలో డెత్ ఓవర్లలో దూకుడుగా ఆడే బ్యాట్స్‌మెన్ కాకపోవడంతో అతను రిజర్వ్ వికెట్ కీపర్‌గానే పరిమితమయ్యే అవకాశముంది. ధోనీ గ్లౌజులు తొడుక్కోవడానికే సిద్ధమయ్యాడంటే జట్టులో ఇక ఏ మార్పూ లేనట్టే. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో బరిలోకి దిగిన జట్టే ఈ మ్యాచ్‌లోనూ ఆడనుంది. లంకతో సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న కోహ్లీ తాజాదనంతో ఈ సిరీస్‌కు సన్నద్ధమయ్యాడు.
రహానెకు చోటు లేదు: ధోని ఆడతాడా లేదా అన్నది తప్పిస్తే.. జట్టు కూర్పుపై ఎలాంటి అనిశ్చితి లేదు. కోహ్లి తిరిగొచ్చిన నేపథ్యంలో రహానె తుది జట్టులో ఉండే అవకాశం కనిపించడం లేదు. ముగ్గురు ప్రధాన బౌలర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లతో బరిలో దిగే అవకాశమున్నందున.. అతడికి చోటు దక్కడం కష్టమే. ఆస్ట్రేలియా, శ్రీలంకతో సిరీస్‌లో అద్భుతంగా రాణించిన పేస్‌ ద్వయం నెహ్రా, బుమ్రాలను కొనసాగించొచ్చు. అశ్విన్‌, జడేజా, యువరాజ్‌ తుది జట్టులో ఆడడం ఖాయం. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు చోటుపై కూడా అనుమానం లేదు. కాబట్టి రహానె బెంచ్‌కే పరిమితం కావొచ్చు. ధోని దూరమైతే కోహ్లి పగ్గాలు అందుకుంటాడు.

భారత్: ధవన్, రోహిత్, కోహ్లీ, రైనా, యువరాజ్, ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్)/ పార్థివ్ పటేల్, పాండ్య, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా

బంగ్లా: సౌమ్య సర్కార్, మహ్మద్ మిథున్, సబ్బీర్, మహ్మదుల్లా, ముష్ఫికర్, షకిబల్, నురుల్ హసన్ (వికెట్ కీపర్), మోర్తజా (కెప్టెన్), అరాఫత్, ముస్తఫిజుర్, అల్ అమిన్ హుస్సేన్

7.00 స్టార్‌స్పోర్ట్స్‌లో

Videos

21 thoughts on “నేటి నుంచే ఆసియా కప్

Leave a Reply

Your email address will not be published.