పార్లమెంట్ సాక్షిగా ఏపీ ప్రజల తరపున పోరాడిన తెలంగాణ ఎంపీలు..

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ పెట్టిన ప్రైవేట్ బిల్లుపై నిన్న మూడున్నర గంటల పాటూ చర్చ జరిగిన సంగతి తెల్సిందే. అయితే ఈ చర్చలో అధికార టీడీపీ ఎంపీల కంటే తెలంగాణ ఎంపీలే ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ బలంగా తమ వాయిస్ వినిపించారు..అధికార టీడీపీ ఎంపీలు నోట్లో బెల్లం గడ్డ పెట్టుకుని అటు ప్రత్యేక హోదా కోసం అడుగుతున్నట్టు కాసేపు నటించి ఇటు మోదీని మాత్రం పల్లెత్తు మాట వినలేదు. కానీ  తెలంగాణకు చెందినటీఆర్ ఎంపీ కేకే, కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ రాజ్యసభలో మోదీ సర్కార్ కు చెమటలు పట్టించారు..నిన్న జరిగిన చర్చలో టీఆర్ ఎంపీ, సీనియర్ నాయకులు కేకే మాట్లాడుతూ  విభజన చట్టం రెండు తెలుగురాష్ట్రాలకు సంబంధించిన అంశమైనా తెలంగాణ గురించి ఎవరూ మాట్లాడలేదంటూనే..`ప్రత్యేక హోదాపై మా ఆంధ్రప్రదేశ్ సోదరులు అడిగిన ప్రతి అంశానికి నా మద్దతు ఉంటుంది. బిల్లులో ఉన్న అంశం కానీ లోక్ సభలో ఇచ్చిన హామీలు కానీ అమలవ్వాల్సిందే..ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే ’ అంటూ తేల్చి చెప్పారు.

ఇక.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ  ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలన్న మాటను బలంగా వినిపించారు. ఈ సందర్భంగా అధికార టీడీపీ ఎంపీల్లాగా నీళ్లు నమలకుండా..చాలా రోజుల తర్వాత వచ్చిన ఛాన్స్ తో రెచ్చిపోయింది. ‘మేమేమన్నా అడుక్కుంటున్నామా?రాజకీయ ప్రయోజనమా? లేక ప్రాంతీయ ద్వేషమా? తెలుగువాళ్లే కదా అని ఏమవుతుందిలే అని తక్కువగా అంచనా వేయమాకండి. ఐదు కోట్ల ఆంధ్రుల పట్టుదల చూడండి.. మంచితనం బలహీనత కాదని గ్రహిస్తారు మీరు. ద్రవ్య బిల్లు అని సాకులు చెబుతూ తప్పుకోవాలని చూస్తున్నారా?..అంటూ రేణుకా రాజ్యసభలో ఓ రేంజ్ లో ఫైర్ అయింది..

ఏపీకి చెందిన అధికార టీడీపీ ఎంపీలతో పోలిస్తే  తెలంగాణకు చెందిన నేతలే ప్రత్యేక హోదా అంశంపై బలంగా.. స్పష్టంగా.. సూటిగా ప్రత్యేక హోదా ఇవ్వాలని తేల్చి చెప్పారు. సిగ్గుచేటైన ఈ విషయాన్ని తెలుగు తమ్ముళ్లు ఏ విధంగా కవర్ చేసుకుంటారో కానీ.. ఏపీ కోసం తెలంగాణ నేతలు మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఆంధ్రా ప్రజలంతా ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు..రాష్ట్రాలుగా విడిపోదాం..అన్నాదమ్ముల్లాగా కలుసుందాం అని తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు అన్న మాటలు అప్పుడు పట్టించుకోలేదు కానీ..కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం సంతోషంగా ఉంటుందని ఆంధ్రా ప్రజలు భావిస్తున్నారు..

Videos

36 thoughts on “పార్లమెంట్ సాక్షిగా ఏపీ ప్రజల తరపున పోరాడిన తెలంగాణ ఎంపీలు..

Leave a Reply

Your email address will not be published.