షాక్: దర్శకురాలు బి.జయ కన్నుమూత

సినీ న‌టుడు క‌మ్ రాజ‌కీయ నేత నంద‌మూరి హ‌రికృష్ణ‌.. సినీ.. రాజ‌కీయ రంగాల‌తో పాటు సామాన్యుల‌కు సైతం షాకిచ్చింది. అనుకోని రీతిలో రోడ్డు ప్ర‌మాదంలో ఆయ‌న అసువులు బాసిన సంగ‌తి తెలిసిందే. గురువారం సాయంత్రం ఆయ‌న అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. ఇదిలా ఉండ‌గా.. టాలీవుడ్‌కు మ‌రో షాక్ త‌గిలింది. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళా ద‌ర్శ‌కురాలిగా ప‌లు చిత్రాల్ని నిర్మించిన బి.జ‌య‌(54) గుండెపోటుతో క‌న్నుమూశారు.

ఒకప్పుడు కాలమిస్టుగా – పీఆర్వోగా పని చేసిన జయ తర్వాత నిర్మాతగా.. దర్శకురాలిగా సత్తా చాటుకున్నారు. టాలీవుడ్ లెజెండరీ పీఆర్వో బి.ఎ.రాజుకు జయ సతీమణి. భర్తతో కలిసి సూపర్ హిట్ మ్యాగజైన్ నడపడంతో పాటు ‘సూపర్ హిట్ ఫ్రెండ్స్’ బేనర్ లో సినిమాలు కూడా నిర్మించారు. ఆ తర్వాత సొంత బేనర్లో ‘చంటిగాడు’ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు జయ.ఈ చిత్రం అప్పట్లో ఓ మోస్తరుగా ఆడింది. ఆపై ‘ప్రేమికులు’.. ‘గుండమ్మగారి మనవడు’.. సవాల్ – లవ్ లీ – వైశాఖం సినిమాలు రూపొందించారామె. వీటిలో ‘లవ్ లీ’ జయకు చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆమెకు దర్శకురాలిగా ఇదే అత్యుత్తమ చిత్రం అనొచ్చు. ఈ సినిమా చూసి సీనియర్ హీరో అక్కినేని నాగార్జున జయ దర్శకత్వంలో నటించడానికి కూడా ఆసక్తి చూపించడం విశేషం.

సినీమా జ‌ర్న‌లిస్టుగా త‌న కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆమె.. త‌ర్వాతి కాలంలో ద‌ర్శ‌కురాలిగా ప‌లు చిత్రాలు తీశారు. ఆమె తీసిన ఆఖ‌రు చిత్రం వైశాఖం 2017లో రిలీజ్ అయ్యింది. టాలీవుడ్ తార‌లుగా సుప‌రిచితులు కామ్న జెఠ్మ‌లానీ.. శాన్వి.. సుహాసిని లాంటి న‌టీమ‌ణుల‌ను ప‌రిచ‌యం చేసింది జ‌య‌నే. ఆమె అంత్య‌క్రియ‌లు ఈ రోజు (శుక్ర‌వారం) ఉద‌యం పంజాగుట్ట శ్మ‌శాన‌వాటిక‌లో జ‌ర‌గ‌నున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు చెప్పారు. రోజుల వ్య‌వ‌ధిలో ఇండ‌స్ట్రీకి చెందిన ఇద్ద‌రు మ‌ర‌ణించ‌టం సినీ వ‌ర్గాల‌ను విషాదంలో మునిగేలా చేసింది.

Videos

11 thoughts on “షాక్: దర్శకురాలు బి.జయ కన్నుమూత

Leave a Reply

Your email address will not be published.