పవన్‌కు కవరేజీ తగ్గించేసిన ఆ ఛానల్స్..!

పచ్చ మీడియా అంటే అల్లాటప్పా కాదు. పరమ నీఛమైన మైండ్ సెట్ తో పని చేసే మీడియా వర్గాలు ఇవి. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేయడమే వీటి పని. అంతకు మించి వేరే అజెండా ఏమీ లేదు. అవతల ఉన్నది ఎవరు అనేది ప్రధానం కాదు, తెలుగుదేశం ప్రయోజనాలే ముఖ్యం. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ విషయంలో కూడా పచ్చ మీడియా వర్గాలు ఒకే రీతిన వ్యవహరిస్తున్నాయి. జనసేనాధిపతికి అప్పుడే కవరేజీని తగ్గేంచేశాయి సదరు మీడియా వర్గాలు.

తనపై కుట్ర జరుగుతోందని, ఆ కుట్రలో టీవీ 9 యజమానులు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనయుడు భాగస్వామ్యులు అని పవన్ ప్రకటించాడు. దాంతో పాటుగా వివిధ మీడియా వర్గాలు కూడా తనపై కుట్రలో పాలుపంచుకున్నాయని పవన్ స్వయంగా ప్రకటించాడు. అంతేగాక.. పచ్చ మీడియా వర్గాలను బహిష్కరించాలని కూడా పవన్ పిలుపునిచ్చాడు.

టీవీ 9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహాటీవీ వంటి పచ్చ మీడియా వర్గాలను బహిష్కరించాలని పవన్ పిలుపునిచ్చాడు. ఈ నేఫథ్యంలో ఆ ప్రభావం అప్పుడే ఆ చానళ్ల తీరులో కనిపిస్తోంది. నిన్న ఫిల్మ్ ఛాంబర్ వద్ద పవన్ కల్యాణ్ ను అస్సలు చూపలేదు ఆ మీడియా వర్గాలు. పవన్ కల్యాణ్ అంటే ఎవరో తెలియదన్నట్టుగా వ్యవహరించాయి ఆ మీడియా వర్గాలు. మామూలుగా పవన్ కల్యాణ్ కు బాగానే కవరేజ్ ఇచ్చేవాళ్లు. జనాల ముందుకు వస్తే చూపించే వాళ్లు .అయితే పవన్ కల్యాణ్ ఎప్పుడైతే బహిష్కరణ అన్నాడో, ఎప్పుడైతే తనపై వాళ్లు చేసిన కుట్రను పవన్ బయటపెట్టడంతో మీడియా వర్గాలు పవన్ విషయంలో వేరే రకంగా వ్యవహరిస్తున్నాయిప్పుడు

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *