బాల‌కృష్ణ స‌ర‌స‌న ముచ్చ‌ట‌గా మూడో హీరోయిన్‌..

నంద‌మూరి బాల‌కృష్ణ 101వ చిత్రం పైసా వ‌సూల్ రీసెంట్‌గా విడుద‌ల కాగా, ఇప్పుడు 102వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. 102వ చిత్రాన్ని కేఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు బాల‌య్య‌. సి. క‌ళ్యాణ్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి జ‌య‌సింహ‌, రూల‌ర్ అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించ‌నున్న ఈ చిత్రంలో పంజాబ్ హీరో విల‌న్ గా క‌నిపించ‌నున్నాడు. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న‌ ఈ చిత్రం తమిళనాడులోని కుంభకోణంలో ఆ తరువాత వైజాగ్, హైదరాబాద్ లో షూటింగ్ జ‌రుపుకోనుంది . అయితే ఈ చిత్ర క‌థ‌కి అనుగుణంగా ముగ్గురు హీరోయిన్స్ కావ‌ల‌సి ఉండ‌గా, న‌య‌న‌తారని ఓ హీరోయిన్‌గా ఎంపిక చేయ‌గా, మాల‌యాళ బ్యూటీ న‌టాషా దోషిని సెకండ్ హీరోయిన్‌గా ఎంపిక చేశారు. మలయాళంలో ‘హైడ్ అండ్ సీక్, నయన, కాల్ మీ @’ చిత్రాల‌లో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది ఈ అమ్మ‌డు. ఇక మూడో హీరోయిన్‌గా ఎవ‌రిని ఎంపిక చేస్తారా అని చ‌ర్చ‌లు జ‌రుగుతున్న టైంలో హిట్స్ లేక ఇబ్బందులు ప‌డుతున్న రెజీనాని ఫైన‌ల్ చేశార‌ని టాక్‌. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌ల‌సి ఉంది.

సంక్రాంతికి బాల‌య్య 102 మూవీని విడుద‌ల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చిరంతన్‌ భట్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చనున్నారు. స‌మ‌రసింహా రెడ్డి స్టైల్ లోనే ఈ సినిమా ఉంటుంద‌ని స‌మాచారం. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అశుతోష్ రాణాలు ఈ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

Videos

4 thoughts on “బాల‌కృష్ణ స‌ర‌స‌న ముచ్చ‌ట‌గా మూడో హీరోయిన్‌..

 • January 18, 2020 at 12:22 pm
  Permalink

  Cialis Precio Oficial En Farmacia Kamagra Discount Commander Du Viagra En Belgique Buy Cialis Viagra Bestellen 100mg

 • January 19, 2020 at 6:37 am
  Permalink

  Comprar Viagra Generica Farmacia Cialis Generique Belgique Viagra Nutzt Nichts cialis Propecia O Lacovin Albuterol Sulfate

 • January 19, 2020 at 10:01 am
  Permalink

  Amoxicillin Elixir Cialis Buy 36 Hour Cialis Online 382 Viagra Effets Secondaires Viagra Venta Sin Receta

Leave a Reply

Your email address will not be published.