రాహుల్ గాంధీ నన్ను పెళ్లి చేసుకోవాలి, హామీ ఇచ్చాడు.. మహిళ హల్‌చల్ (వీడియో)

మన దేశంలో ప్రముఖులను పెళ్లి చేసుకోవాలనుకునే వారు ఎంతో మంది ఉంటారు. సినిమా తారలను, క్రీడాకారులను, రాజకీయ నాయకులను పెళ్లి చేసుకోవాలని కలలు కనే వారు ఉంటారు. తాజాగా, ఓ మహిళ రాహుల్ గాంధీ నన్ను ఎందుకు పెళ్లి చేసుకోకూడదని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్‌చల్ సృష్టిస్తోంది. దేశంలోనే రాహుల్ గాంధీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా పేరుపడ్డారు.

ఓ మహిళ మీడియా ముందుకు వచ్చి రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటానని హంగామా చేసింది. అంతేకాదు, తనను రాహుల్ ఎందుకు పెళ్లి చేసుకోవాలో కూడా కారణాలు చెప్పింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాదులో జరిగింది. ఆమె గుర్తు తెలియని మహిళా కాంగ్రెస్ సేవా దళ్ కార్యకర్తగా చెబుతున్నారు. యువనేతకు తన ప్రేమను వెల్లడి చేసేందుకు ఆమె రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది.

దళితులతో సహపంక్తి భోజనం చేయడం, దళితులకు సహాయం చేయడం వంటి కార్యక్రమాలతో తాను రాహుల్ గాంధీకి వీరాభిమానిగా మారిపోయానని చెప్పింది. తాను ఓబీసీ వర్గానికి చెందిన మహిళను అని, కాంగ్రెస్ పార్టీకి చాలా కాలంగా సేవలు అందిస్తున్నానని చెప్పింది. తనను రాహుల్ ఎందుకు పెళ్లి చేసుకోకూడదని ప్రశ్నించింది.

రాహుల్ గాంధీని పెళ్లి చేసుకునేందుకు 2006 నుంచే ఆలోచన చేస్తున్నట్లు చెప్పింది. అప్పట్లో తనకు రాహుల్ గాంధీ అంటే చిన్నపాటి నమ్మకమే ఉండేదని, అయితే 2014లో పార్టీలో చేరిన నాటి నుంచి ఆయన పట్ల తన నమ్మకం మరింత బలపడుతూ వచ్చిందని తెలిపింది. అప్పటి నుంచి అనేక కార్యక్రమాల్లో రాహుల్ గాంధీని చూశానని చెప్పింది.

రాహుల్ గాంధీని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని మీడియా ప్రశ్నించగా.. ఆయన మంచివాడని, ప్రధాని కొడుకు అని, మంచి నేత అని, రాహుల్ తనను పెళ్లి చేసుకుంటే నా కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పింది. ఆయన మాట ఇచ్చారా అని ప్రశ్నిస్తే ముఖాముఖి మాట్లాడలేదని, తరుచూ కలలో కనిపించి నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తున్నారని చెప్పింది.

Videos

Leave a Reply

Your email address will not be published.