గొంతు నొప్పిని త‌గ్గించే ఎఫెక్టివ్ టిప్స్‌..!

ఏ సీజ‌న్‌లో అయినా చాలా మందిని గొంతు నొప్పి బాధిస్తుంటుంది. దీంతో ఏం తినాల‌న్నా తిన‌లేరు, తాగాల‌న్నా తాగ‌లేరు. చాలా ఇబ్బంది క‌లుగుతుంది. మాట్లాడుదామ‌న్నా నొప్పి క‌లుగుతుంది. అయితే ఏ కార‌ణం వ‌ల్ల గొంతు నొప్పి వ‌చ్చినా దాన్ని త‌గ్గించుకునేందుకు ప‌లు ఎఫెక్టివ్ టిప్స్ మన‌కు అందుబాటులో ఉన్నాయి. అవేమిటంటే…

1. ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు వేసి బాగా క‌లిపి ఆ నీటితో గొంతులో పుక్కిలించాలి. దీంతో చాలా త్వ‌ర‌గా గొంతు నొప్పి త‌గ్గుతుంది. వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

2. ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ అల్లం ర‌సం తీసుకుని బాగా క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి. ఇలా రెండు, మూడు రోజులు వ‌రుస‌గా చేస్తే చాలు త్వ‌ర‌గా గొంతు నొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు. అల్లం, తేనెల‌లో ఉండే యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు గొంతు నొప్పిని ఎఫెక్టివ్‌గా త‌గ్గిస్తాయి.

3. ఒక గ్లాస్ వేడి నీటిలో కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా క‌లిపి ఆ నీటిని గొంతులో పోసుకుని గ‌ట గ‌టా పుక్కిలించాలి. దీంతో గొంతు నొప్పి నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

4. ఒక గ్లాస్ వేడి పాల‌లో అల్లం ర‌సం, మిరియాల పొడి వేసి బాగా క‌లిపి తాగితే గొంతు నొప్పి త‌గ్గుతుంది.

5. ఒక గ్లాస్ వేడి నీటిలో తేనె క‌లుపుకుని తాగినా గొంతు నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

Videos

724 thoughts on “గొంతు నొప్పిని త‌గ్గించే ఎఫెక్టివ్ టిప్స్‌..!

Leave a Reply

Your email address will not be published.