ఆ టాలీవుడ్ యంగ్ హీరో వైవాహిక జీవితం చిక్కులో ప‌డింద‌ట‌!

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఆ  యంగ్ హీరోకు మంచి డిమాండ్ ఉంది. కొన్ని రోజులుగా  హిట్లు ప‌డ‌లేదు కానీ గ‌తంలో ఏడాదంతా అత‌ని సినిమాలే న‌డిచేవి. మొద‌ట్లో కొంద‌రు హీరోయిన్ల‌తో ఎఫైర్లు న‌డిపిన ఈ యంగ్ హీరో త‌ర్వాత ఇంట్లో వాళ్లు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు. అయితే గ‌డిచిన కొన్ని రోజులుగా అత‌ని వైవాహిత జీవితంలో క‌ల‌త‌లు రేగుతున్నాయ‌ని టాక్స్ న‌డుస్తున్నాయి. అత‌ని పార్టీ లైఫ్, అల‌వాట్లు, లేట్ గా నిద్ర‌లేచే ల‌క్ష‌ణం న‌చ్చ‌క‌ అత‌ని ఇంట్లో గొడ‌వ‌లు చెల‌రేగాయ‌ట‌.

మొద‌ట్లో సినీ ఇండ‌స్ట్రీలో ఇలాంటివి కామ‌న్ అని అత‌ని భార్య లైట్ తీసుకున్నా క్ర‌మ‌క్ర‌మంగా అవి ఇబ్బందిగా మార‌డంతో ఆ హీరో భార్య అత‌నితో ఇమ‌డ‌లేక‌పోతుంద‌ట‌. అత‌ని పాత సంబంధాల‌ను క్ష‌మించేసినా తాజాగా ఓ పొడుగు హీరోయిన్ తో అత‌ను క్లోజ్ గా మూవ్ కావ‌డం ఆ హీరో ఇంట్లో చిచ్చుపెట్టింద‌ని స‌మాచారం. ఇంట్లో చెల‌రేగుతున్న ఈ గొడ‌వ‌ల వ‌ల్ల‌నే స‌ద‌రు హీరోగారు క‌థ‌ల‌ను స‌రిగా ఎంచుకోలేక ఇటీవ‌లి కాలంలో వ‌రుస ఫ్లాప్ ల‌ను మూట‌గ‌ట్టుకుంటున్నాడ‌ని ఫిల్మ్ స‌ర్కిల్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *