పవన్ భజన త్రివిక్రమ్ ఎప్పుడు ఆపుతాడో !

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటేనే మాటల ఘని .. అందుకే ఆయనకి మాటల మాంత్రికుడు అని పేరు కూడా పెట్టుకున్నారు అభిమానులు. తెరమీద మాత్రమే కాకుండా బయట స్టేజీ ల మీద కూడా మాట్లాడడం లో తనదైన శైలి లో నడుస్తూ ఉంటారు త్రివిక్రమ్ శ్రీనివాస్. అప్పట్లో సిరివెన్నల గురించి ఆయన చెప్పిన మాటలు ఎందరికో తెగ నచ్చేసాయి. ఆ తరవాత అత్తారింటికి దారేది వేడుక లో పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ పవన్ ని మొదటి సారి ఫార్మ్ హౌస్ లో చూసినప్పుడు ఆయనకీ కలిగిన అనుభవాలు చెప్పుకొచ్చిన త్రివిక్రమ్ పవన్ ఫాన్స్ కి తన మాటలతోనే విపరీతమైన కిక్ ని ఇచ్చారు.

ఆ మొదలు పెట్టడం మొదలు పెట్టడం ఎప్పుడు స్టేజీ ఎక్కినా ఎదో రకంగా పవన్ కి డప్పు కొట్టడం త్రివిక్రమ్ కి తప్పడం లేదు. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా టైం లో పవన్ దేవుడు అనేసాడు త్రివిక్రమ్. అది చాలా ఓవర్ గా కూడా అనిపిచింది. బండ్ల గణేష్ లాంటి వారు అలా మాట్లాడితే ఓకే గానీ త్రివిక్రమ్ మంచి మాటలు నాలుగు చెప్పాలి , మరీ అవసరం లేని హై పిచ్‌లో పవన్‌ను పొగిడే పని పెట్టుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. నిన్న కాటమరాయుడు ప్రీ రిలీజ్ లో కూడా పవన్ ఎటు వెళ్ళమంటే జనం అటు వెళ్ళడానికి సిద్దం గా ఉన్నారు అనీ అనవసర పొగడ్తలు కురిపించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *