పవన్ అభిమానులను కన్ఫ్యూజన్ లోకి నెడుతున్న త్రివిక్రమ్ !

పవన్, త్రివిక్రమ్ ల చిత్రం మొదల్యయ్యాక ఈ చిత్రానికి ‘దేవుడే దిగివచ్చిన’అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి. దేవుడే దిగివచ్చిన టైటిల్ బావుందని పవన్ కళ్యాణ్ కు సూటవుతుందని అభిమానులు సంబరపడ్డారు. టైటిల్ పవర్ ఫుల్ గా ఉండడంతో సినిమా కూడా అదేవిధంగా ఉంటుందని భావించారు. కాగా ఇప్పుడు త్రివిక్రమ్ పవన్ అభిమానులను గందరగోళంలోకి నెడుతున్నాడు.

కొద్ది రోజులుగా ఈచిత్రానికి ‘దేవుడే దిగివచ్చిన’ టైటిల్ తో పాటు ‘ఇంజనీర్ బాబు’ అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.దాదాపుగా ‘ఇంజనీర్ బాబు’టైటిల్ ఫైనల్ అయిపోయినట్లే అని సమాచారం అందుతోంది.ఇది సాఫ్ట్ టైటిల్ కావడంతో పవన్ అభిమానులు పెదవి విరుస్తున్నారు. పవర్ ఫుల్ టైటిల్ తో వస్తాడనుకుంటే సాఫ్ట్ టైటిల్ వెంట పడ్డా డేంటి త్రివిక్రమ్ అని అంటున్నారు. మరికొందరు అభిమానులు మాత్రం త్రివిక్రమ్ ఏం చేసినా దానికి ఓలెక్క ఉంటుందని కథకు 100 శాతం సరిపోయే టైటిల్ నే ఫిక్స్ చేస్తాడని అంటున్నారు. కాగా ఈచిత్రం లో పవన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో పవన్ పాత్ర పేరు కూడా ‘బాబు’ అని అంటున్నారు.

Videos

2,361 thoughts on “పవన్ అభిమానులను కన్ఫ్యూజన్ లోకి నెడుతున్న త్రివిక్రమ్ !