పాక్ ప్రధానిని మితంగా మాట్లాడమన్న ట్రంప్

ఇటీవల పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భారత ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడిన మోదీ.. ఇమ్రాన్‌ రెచ్చగొట్టే ధోరణిని ఆయన వద్ద ఎండగట్టారు. పాక్‌ ప్రధాని ఉపయోగిస్తున్న తీవ్ర పదజాలంతో ప్రాంతీయంగా శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వివరించారు. ఉగ్రవాదానికి ముగింపు పలికే వాతావరణాన్ని ఏర్పర్చాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ట్రంప్‌ కొన్ని గంటల వ్యవధిలోనే ఇమ్రాన్‌ ఖాన్‌తో ఫోన్‌ ద్వారా మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కశ్మీర్‌పై మితంగా మాట్లాడాలని సూచించారు. ఈ విషయాన్ని స్వయంగా శ్వేతసౌధమే వెల్లడించింది. నాకు మంచి మిత్రులైన భారత ప్రధాని మోదీ, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో మాట్లాడాను. వాణిజ్య, ద్వైపాక్షిక, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చ జరిగింది. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే దిశగా చర్చలు సాగాయి. ఆందోళనకర పరిస్థితుల మధ్య సుహృద్భావ మంతనాలు జరిగాయి’’ అని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

Videos

Leave a Reply

Your email address will not be published.