ఐబీఎం సాఫ్ట్‌వేర్ కంపెనీకి వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

ప్రపంచంలోనే అతి పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఒకటైన ఐబీఎంకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. మిన్నేపొలిస్‌లో 500 మంది ఉద్యోగులను ఐబీఎం తొలగించిందని, ఆ ఉద్యోగాలను భారత్, ఇతర దేశాలకు తరలించిందని ఆయన ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే అలా చేసే కంపెనీలకు 35 శాతం అదనపు పన్నులు వేస్తానని ట్రంప్ అన్నారు. అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకేనని అన్నారు. డెమొక్రెటర్లకు కంచుకోటలాంటి మిన్నోసోటా రాష్ట్రంలో పాగా వేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. మిన్నెసోటలోని రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులకు ప్రమాదకరంగా ఉన్న ఒబామా చట్టాలన్నింటిని రద్దు చేస్తామని ఆయన అన్నారు

Videos

Leave a Reply

Your email address will not be published.