జగన్‌తో మిగిలే ఎమ్మెల్యేల సంఖ్య ఇదేనా?

ఏపీలో అధికారపార్టీ టీడీపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’ కు తెరలేపి ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ను ఇబ్బందుల్లోకి నెట్టిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ నిపుణులు. TDP ‘ఆపరేషన్ ఆకర్ష్’ వైయస్ జగన్ తన పార్టీ అస్తిత్వాన్నే కోల్పోయేలా చేయనుందా? నిజానికి YCP పార్టీ టికెట్‌పై గెలిచి జగన్ వద్ద విధేయులుగా ఉండాల్సిన ఎమ్మెల్యేలే అధినేత వద్ద ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు.

సోమవారం  జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయన్ని నిలదీసేంత పని చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాదు జగన్ మాటకు ఎదురు చెప్పే ప్రయత్నం చేయడంతో వారిద్దరిపై జగన్ నాకే ఎదురు చెప్తారా? అంటూ కాస్తంత అసహనానికి గురయ్యారని, సమావేశం నుంచి అర్థంతరంగా వెళ్లిపోయారని సమాచారం.పార్టీ ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండడం, వారితో సఖ్యతగా ఎలా మెలగాలనే దానిపై జగన్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు సలహాలు ఇవ్వబోగా ఆయనకు కోపం వచ్చినట్లు వార్తలు వచ్చాయి.

అయితే జగన్‌కు కోపం తెప్పించేలా ప్రవర్తించిన ఆ ఇద్దరూ ఎమ్మెల్యేల్లో ఒకరు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాగా, మరొకరు కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి అని తెలుస్తోంది. తొలుత శ్రీనివాసరెడ్డి, జగన్‌కు సలహాలు చెప్పడం ప్రారంభించాడని, ఒక రకంగా జగన్‌ను నిలదీసినట్లుగానే ఆయన మాట్లాడుతుండగా జగన్‌కు కోపం వచ్చిందని అంటున్నారు. జగన్ ఆయనకు ఏదో చెప్పబోయే సమయానికి, ప్రతాప్‌కుమార్‌ రెడ్డి కూడా లేచి ఎమ్మెల్యేల పట్ల జగన్‌ వ్యవహారశైలి గురించి మాటలు అన్నట్లు సమాచారం. దాంతోనే జగన్ కోపం వచ్చి సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారని చెప్పుకుంటున్నారు. అయితే జగన్ తీరు వల్లే కొందరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నట్లు కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిజానికి జగన్ నిర్వహించిన సమావేశానికి వైసీపీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు గైర్హజరయ్యారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *