ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు…

ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. విషయానికి వస్తే తమిళనాడు లోని జాఫర్ పేట్ సమీపంలో మంగళవారం రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చాయి. ఈ రెండు రైళ్లు 150 మీటర్ల దూరంలో ఉండగా ఎదురుగా వస్తున్న రైలును లోకో పైలెటు గుర్తించి నిలిపివేశాడు. వెంటనే కిందకు దిగి ఎదురుగా వస్తున్న రెఐలు పైలెట్ ను అప్రమత్తం చేశాడు. ఆ రైలు కూడా ఆగిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. దీనితో ఆకస్మికంగా రైలు ఎందుకు ఆగిందో అని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కానీ విషయం తెలుసుకుని బతుకు జీవుడా అనుకున్నారు.

Videos