ఉదయ్ మొదలయ్యింది…

ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు పట్టాలెక్కింది. విశాఖ నుంచి విజయవాడకు నడిచే డబుల్‌ డెక్కర్‌ ఏసీ రైలును..  రైల్వే సహాయ మంత్రి సురేష్‌ చన్నబసప్ప అంగడి అధికారికంగా గురువారం ప్రారంభించారు. ఉదయం 11.30 గంటలకు విశాఖ రైల్వేస్టేషన్‌ ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాంపై రైలుకు పచ్చజెండా ఊపి ఆరంభించారు. వారానికి ఐదురోజులు (ఆది, గురువారం తప్ప)  పరుగులు తీయనుంది. ఎన్నో ప్రత్యేకతలతో ప్రారంభమైన ఉదయ్ రైలుకు విశాఖ నుంచి విజయవాడకు టిక్కెట్ ధర 525 రూపాయిలగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, గొట్టేడి మాధవి, జీవీఎల్‌ నర్సింహారావు, రఘురామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రైలు విశాఖ నుంచి అయిదున్నర గంటల్లో విజయవాడ చేరుకుంటుంది. అన్ని కోచ్‌లలో డిస్క్‌ బ్రేక్‌లతో పాటు ఫెయిల్యూర్‌ ఇండికేషన్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు ఉంది.

Videos