స్కర్టులు ధరించకండి : విదేశీ పర్యాటకులకు కేంద్రమంత్రి సలహా

భారతదేశ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులు దయచేసి స్కర్టులు ధరించకండి అని కేంద్ర మంత్రి మహేష్ శర్మ సలహా ఇచ్చారు. దేశంలో పర్యటించేందుకు వచ్చిన విదేశీ పర్యాటకులు ఎం చేయాలి ? ఎం చేయకూడదనే అంశాలను ఓ కార్డుపై రాసి విమానాశ్రయాల్లో వారికి అందజేస్తున్నామని కేంద్రమంత్రి చెప్పారు. సాంస్కృతిక దేశమైన మన భారత్ లో దేవాలయాలను సందర్శించేందుకు ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ఉందని ఆయన పేర్కొన్నారు. ఆగ్రాలోని అద్భుతమైన తాజ్ మహల్ ను చూడటానికి వచ్చిన విదేశీ పర్యాటకుల భద్రత కోసం స్కర్టులు ధరించి తిరగవద్దని కేంద్రమంత్రి సూచించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి వివరణ ఇచ్చారు. విదేశీ పర్యాటకులు ఎం ధరించాలి ఎం ధరించకూడదు అని తాము చెప్పడం లేదని రాత్రివేళ బయటకు వెళ్లేటపుడు వారు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.

ఎవరైనా దుస్తులు వారి ఆలోచనా విధానాన్ని బట్టి ధరించవచ్చని, దానిని మార్చుకోవాలనే హక్కు తనకు లేదన్నారు. స్కర్టులు ధరించవద్దని కేంద్రమంత్రి ఇచ్చిన సలహాపై ట్విట్టర్ ద్వారా నెటిజన్లు స్పందించారు. ఇలాంటి సలహాలతో దేశాన్ని కించపర్చవద్దని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వ మంత్రి కపిల్ మిశ్రా వ్యాఖ్యానించారు. కొందరు నెటిజన్లు కేంద్రమంత్రికి మద్ధతుగా నిలిచారు. దేవాలయాలు, ఇతర పవిత్ర స్థలాల్లో విదేశీయులు స్కర్టులు ధరించరాదని కేంద్రమంత్రి చేసిన సూచనతో తాము ఏకీభవిస్తున్నట్లు పలువురు ట్విట్ చేశారు. మన దేశ మహిళలు ఇస్లామిక్ దేశాలకు వెళ్లినపుడు బుర్ఖా, స్కార్ఫ్ ధరించాలని కూడా సలహా ఇవ్వాలని ఓ నెటిజన్ ట్విట్ చేశారు.

Videos

21 thoughts on “స్కర్టులు ధరించకండి : విదేశీ పర్యాటకులకు కేంద్రమంత్రి సలహా

Leave a Reply

Your email address will not be published.