నాడాకి భారీ షాక్..

జాతీయ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ(ఎన్‌డీటీఎల్‌) కు భారీ షాక్ తగిలింది. ఈ సంస్థ అధికారిక గుర్తింపును ఆర్నెళ్ల పాటు రద్దు చేస్తూ వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ(వాడా) నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్‌ కి మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో వాడా తీసుకున్న నిర్ణయం తీవ్ర కలవరం రేకెత్తిస్తోంది. దేశీయంగా డోపింగ్‌ నిరోధం పట్ల తీసుకుంటున్న ముమ్మర చర్యలకు ఇది పెద్ద అడ్డంకిగా మారనుంది. ఎందుకంటే భారత్ గుర్తింపు పొందిన డోప్ టెస్టింగ్ ల్యాబ్ ఎండిటీఎల్ మాత్రమే. ఎన్‌డీటీఎల్‌ ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడమే గుర్తింపు రద్దునకు కారణమని మీడియాకు ఇచ్చిన వివరణలో వాడా తెలిపింది. అయితే నిబంధనల ప్రకారం వాడా నిషేధాన్ని సవాల్‌ చేస్తూ ఎన్‌డీటీఎల్‌ 21 రోజుల్లోగా కోర్ట్ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌(సీఏఎస్‌)ని ఆశ్రయించే వెసులుబాటు ఉంటుంది.

Videos

3 thoughts on “నాడాకి భారీ షాక్..

Leave a Reply

Your email address will not be published.