లైట్‌ ఆపలేదని ఎన్టీయార్‌ తన్నారు: వేణుమాధవ్‌!

కొన్ని సంవ్సరాల కిత్రం వరకు వరుసబెట్టి సినిమాలు చేసిన కమెడియన్‌ వేణుమాధవ్‌ ఇప్పుడు కాస్త స్లో అయ్యాడు. అనారోగ్య కారణాలతో వెండితెరకు దూరమైన వేణుమాధవ్‌ ఇప్పుడు మళ్లీ బిజీ అవుతున్నాడు. సినిమాల్లోకి రాకముందు వేణుమాధవ్‌ తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో పనిచేశాడనే విషయం తెలిసిందే. ఆ సందర్భంగా సీనియర్‌ ఎన్టీయార్‌తో జరిగిన ఓ సంఘటన గురించి ఇటీవలి ఓ టీవీ ప్రోగ్రామ్‌లో వెల్లడించాడు వేణుమాధవ్‌.

‘‘సినిమాల్లోకి రాకముందు తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో టెలీఫోన్‌ ఆపరేటర్‌గా పనిచేశాను. ఆ సమయంలో నా జీతం నెలకు ఆరు వందలు. అప్పుడప్పుడు ఎన్టీయార్‌ ఇంటి వద్ద నైట్‌డ్యూటీ వేసేవారు. అలాంటి సందర్భంలో ఒకరోజు తెల్లవారుజామున ఎన్టీయార్‌ ఇంట్లో లైట్‌ ఆఫ్‌ చేయడం మర్చిపోయాను. ఆ వెలుగుతున్న లైట్‌ను ఎన్టీయార్‌ చూసేశారు. నన్ను పిలిచి క్లాస్‌ పీకారు. తీవ్రంగా మందలించారు. వెనక్కి తిరగమని చెప్పి ఒక్క తన్ను తన్నారు. దాంతో నేను బయటకు వచ్చేశాను. పదిహేను నిమిషాల తర్వాత లోపలి నుంచి ఓ వ్యక్తి వచ్చి ‘పెద్దాయన నిన్ను పిలుస్తున్నారు’ అని చెప్పాడు.

దాంతో నాకు మరింత భయం వేసింది. అలా భయపడుతూనే ఎన్టీయార్‌ గదిలోకి అడుగుపెట్టాను. అప్పుడు ఆయన నేతి దోశె తింటున్నారు. నన్ను చూడగానే.. ‘రండి బ్రదర్‌’ అని పిలిచి ఆయన తింటున్న దోశెలో నుంచి ఓ ముక్క నాకు ఇచ్చారు. నేను అది పట్టుకుని అక్కడే నిల్చున్నాను. ‘ఏం బ్రదర్‌ ఇంకా ఏమైనా తింటారా?’ అని అడిగారు. దాంతో నేను ‘వద్దు అన్నగారు’ అన్నా. ‘బాధ్యతాయుతంగా ఉండండి. మీరిక వెళ్లొచ్చు’ అని బయటకు పంపేశార’’ని వేణుమాధవ్‌ గుర్తు చేసుకున్నాడు.
Videos

25 thoughts on “లైట్‌ ఆపలేదని ఎన్టీయార్‌ తన్నారు: వేణుమాధవ్‌!

Leave a Reply

Your email address will not be published.