మాల్యాకు ఘోర అవమానం…

భారత బ్యాంకులకు  వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన మాల్యాకు అక్కడే దారుణ పరాభవం జరిగింది. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా భారత్‌- దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్‌ జరిగింది.

అయితే ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియం లోపలికి వెళ్తున్న మాల్యాను చూసి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ‘చోర్‌.. చోర్‌..’(దొంగ.. దొంగ..) అంటూ కేకలు పెట్టారట. తొలుత తనను కాదనుకున్న మాల్యా ఆ తర్వాత ఆ కేకలు తనకోసమే అని గ్రహించాడట.దాంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడట మాల్యా.  కొందరు ఆయనను ఫొటోలు తీయడం, చూసి హేళనగా నవ్వడంతో మాల్యా బిక్క చచ్చిపోయారట. అంతేకాకుండా అవమానభారంతో మాల్యా ముఖం మాడ్చుకుని విసురుకుంటూ స్టేడియం లోపలికి వెళ్లిపోయారట. మాల్యా ఇటీవల భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా చూశారు.

అయితే దేశంలోని వివిధ బ్యాంకులకు రూ.వేల కోట్లు రుణాలను ఎగవేసి విజయ్‌మాల్యా లండన్‌ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ సందర్భంగా టీమ్‌ ఇండియా ఆడే మ్యాచ్‌లను మాల్యా నేరుగా స్టేడియానికి వచ్చి వీక్షిస్తున్నారు. పాకిస్థాన్‌ మ్యాచ్‌ సందర్భంగా సునీల్‌ గావస్కర్‌తోనూ ముచ్చటించారు.

అంతేకాకుండా విరాట్‌ కోహ్లి ఫౌండేషన్‌ నిర్వహించిన విందు కార్యక్రమంలోనూ మాల్యా పాల్గొనడం గమనార్హం. వివాదాస్పదుడు కావడంతో కార్యక్రమం సందర్భంగా కోహ్లి సహా టీమ్‌ ఇండియా ఆటగాళ్లు మాల్యాకు దూరంగా ఉన్నారట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *