రాజ్యసభకు విజయ్‌ మాల్యా రాజీనామా!

లండన్: బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి లండన్లో తలదాచుకుంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాజాగా తనరాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్కు రాజీనామా లేఖను పంపినట్లు మాల్యాసోమవారం ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. బ్యాంకులకు రూ. 9000 కోట్ల ఎగవేతకు పాల్పడిన మాల్యాపై చర్య తీసుకోవాలని రాజ్యసభ నైతిక విలువల కమిటీ భావిస్తున్న నేపథ్యంలో మాల్యానే రాజీనామా సమర్పించడం గమనార్హం.

ఈ మధ్య చోటుచేసుకున్న వరుస సంఘటనలు, పరిణామాలను బట్టి చూస్తే భారత్‌లో తనకు న్యాయం లభిస్తుందన్న నమ్మకం లేదని రాజీనామా లేఖలో మాల్యా పేర్కొన్నాడు. అందుకే తన పార్లమెంట్ సభ్యత్వానికి తక్షణమే అమలులోకి వచ్చేలా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించాడు. రాజ్యసభ ఎథిక్స్ కమిటీ చైర్మన్ కరణ్ సింగ్ తనకు లేఖ రాశాడని, ఆ లేఖకు జవాబిచ్చినట్లు మాల్యా రాజీనామా లేఖలో ప్రస్తావించారు. రాజ్యసభ ఎంపీగా ఎన్నికవడం మాల్యాకిది వరుసగా రెండోసారి. రాజీనామా చేయకపోయి ఉంటే మాల్యా పదవీకాలం జూలై 1తో ముగిసి ఉండేది.

గతనెల 25న సమావేశమైన ఎథిక్స్ కమిటీ.. ఈ నెల 3న సమావేశమై మాల్యా సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ సభకు సిఫారసు చేయాలని నిర్ణయించింది. ఈ వారం గడువులో సభ్యత్వ రద్దుపై తన వాదనను విన్పించుకునే అవకాశమిచ్చింది. కానీ ఆయనే స్వయంగా రాజీనామా సమర్పించాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *