సీఎం అభ్యర్థిగా విజయ్‌కాంత్

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్‌ను తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దించాలనే ప్రయత్నాలను కొనసాగించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపకపోవడంతో ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న మరో తమిళ సినీ స్టార్, డీఎండీకే అధినేత విజయకాంత్‌ను తమ అఖిర అస్త్రంగా మలుచుకునేందుకు సిద్ధమవుతోంది బిజెపి.

బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యలతో బుధవారం తమిళ మీడియాల్లో వెలువడ్డ సమాచారం డీఎంకే, డీఎండీకే  కేడర్‌నే కాదు, కమలం వర్గాల్ని విస్మయంలో పడేశాయి. అనూహ్యంగా రాజకీయ మలుపు తిరగడంతో చర్చ బయలు దేరింది.పది శాతం ఓటు బ్యాంక్ కల్గిన డీఎండీకే అధినేత విజయకాంత్ చుట్టూ రాజకీయం సాగుతున్న విషయం తెలిసిందే. నాన్చుడు ధోరణి అనుసరించే విజయకాంత్ ఇంత వరకు తన మదిలో మాటను బయటకు పెట్ట లేదు. భవిష్యత్తు దృష్ట్యా,ప్రాంతీయ పార్టీలతో కలిసి నడవడమే శ్రేయస్కరం అన్న నిర్ణయంతో ఆయన ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి.

కెప్టెన్ సీఎం :
జవదేకర్ మాట్లాడినట్టుగా కొన్ని చానళ్లు ఫ్లాష్ ..న్యూస్‌లతో సమాచారాల్ని  ప్రసారం చేశాయి. డీఎండీకే నేతృత్వంలో ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు జవదేకర్ వ్యాఖ్యానించారని అందులో పేర్కొన్నారు. అలాగే, డీఎండీకేకు 50 శాతం సీట్లు, ప్రజా కూటమిలో ఉన్న వీసీకే కలిసి వస్తే కొన్నిసీట్లు, ఇతర  చిన్న పార్టీలకు సర్దుబాటు పోగా, మిగిలిన స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇక, డీఎండీకే నేతృత్వంలోని కూటమికి సీఎం అభ్యర్థిగా విజయకాంత్‌ను ప్రకటి ంచేందుకు తాము సిద్ధం అని జవదేకర్ వ్యాఖ్యానించినట్టుగా వచ్చిన ఆ ఫ్లాష్..న్యూస్..డీఎంకేకు షాక్ ఇచ్చినట్టు చేసింది.

అలాగే, విజయకాంత్ సతీమణి ప్రేమలత పొత్తు మంతనాల్లో ఉన్నారని వ్యాఖ్యానించడంతో ఇక, పండు పక్వానికి వచ్చి పాలల్లో పడుతుందనుకుంటే, పక్కదారి పట్టిందేంటబ్బా…? అన్న డైలమాలో డిఎంకే వర్గాలు పడ్డాయి. అదే సమయంలో డీఎండీకే వర్గాలు సైతం విస్మయంలో పడ్డాయి. ప్రేమలత విజయకాంత్ జవదేకర్‌తో ఎప్పుడు సంప్రదింపులు జరిపినట్టు, ఢిల్లీ పెద్దల అపాయింట్ మెంట్‌ఎప్పుడు తీసుకున్నట్టు అన్న సందిగ్ధంలో పడ్డారు. ఇక, బీజేపీ వర్గాలకు సైతం ఈ ఫ్లాష్ ..న్యూస్‌లు ఆశ్చర్యాన్ని కల్గించాయి.

Videos

Leave a Reply

Your email address will not be published.