విరాట్, అనుష్క కలిసి ఎక్కడికెళ్లారంటే..

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎక్కడకు వెళ్లినా సంచలనమే. అందరి దృష్టీ అతడి మీదే ఉంటుంది. అనుష్కాశర్మను తోడు తెచ్చుకున్నాడా లేదా అనేదే అందరి ప్రశ్న. అలా చూసేవాళ్లందరికీ సమాధానం చెప్పేలా కోహ్లీ ఈమధ్య అనుష్కను తీసుకుని బయటకు వెళ్లాడు. ఎక్కడికో కాదండీ.. తన ప్రియమైన స్నేహితుడు యువరాజ్ సింగ్‌కు, హేజెల్ కీచ్‌కు జరిగిన పెళ్లికి వెళ్లాడు. హిందూ సంప్రదాయం ప్రకారం గోవాలో పెళ్లి చేసుకున్న యువరాజ్ దంపతులకు అభినందనలు చెప్పేందుకు ఈ జంట వెళ్లింది.
ముందుగా చండీగఢ్‌లో జరిగిన సంగీత్‌కు కూడా వీళ్లిద్దరూ వెళ్లి, అక్కడ కొత్త జంటతో కలిసి డాన్సు కూడా చేశారు. తర్వాత గోవాలో పెళ్లికి కూడా వెళ్లారు. విరాట్ కోహ్లీ నీలి రంగు షేర్వాణీ ధరించగా.. నలుపు, బంగారు వర్నాలలోని ఎథ్నిక్ డ్రస్‌తో అనుష్క చూపరుల మతి పోగొట్టింది. అంతేకాదు.. వీళ్లిద్దరూ ఎయిర్‌పోర్టులో ప్రముఖ బాలీవుడ్ గేయరచయిత జావేద్ అఖ్తర్‌ను కలిసి, ఆయనతో ఫొటోలు కూడా తీయించుకున్నారు. ప్రయాణంలో సౌకర్యంగా ఉండటానికి విరాట్ సింపుల్‌గా తెల్ల టీషర్టు, ప్యాంటు ధరించి, చెప్పులు వేసుకుని వచ్చాడు. చండీగఢ్ నుంచి గోవా వరకు ప్రయాణంలో ప్రేమముచ్చట్లు చెప్పుకోడానికి ఈ జంటకు కావల్సినంత ఫ్రీటైం దొరికింది.
virat-kohli-and-anushka-sharma-attend-yuvraj-marriage
virat-kohli-and-anushka-sharma-attend-yuvraj-marriage
Videos

One thought on “విరాట్, అనుష్క కలిసి ఎక్కడికెళ్లారంటే..

  • December 12, 2019 at 3:12 pm
    Permalink

    Most of the things you claim happens to be supprisingly legitimate and that makes me wonder why I hadn’t looked at this with this light before. This particular article really did turn the light on for me as far as this specific topic goes. Nonetheless at this time there is one particular point I am not necessarily too comfortable with so while I attempt to reconcile that with the central theme of your position, allow me see what the rest of the readers have to say.Nicely done.

Leave a Reply

Your email address will not be published.