అమెరికా వీధుల్లో విరాట్ అనుష్క

టీం ఇండియా ఆటగాళ్లు ప్రస్తుతం అమెరికాలో విహరిస్తున్నారు. వెస్టిండీస్ సిరీస్ లో భాగంగా జరిగే మొదటి రెండు టి20 మ్యాచులు ఫ్లోరిడాలోని మియామిలో జరుగుతుండడం వల్ల జట్టు సభ్యులు అంతా అమెరికా చేరుకున్నారు. ఈ సంధర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మతో కలసి మియామి వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరిద్దరు ఇంతకు ముందు ప్రపంచ కప్ సమయంలో కూడా ఇంగ్లండ్ లో చక్కర్లు కొట్టారు.

వీరిద్దరు చివరిగా ముంబయి ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. ఇప్పుడు అమెరికాలో విహరిస్తున్నారు. టీం ఇండియా ఈ రెండు టి20 లు తర్వాత మిగతా మూడు టీ20లు, మూడు వన్డేలు, ఒక టెస్టు మ్యాచు వెస్టిండీస్ లో ఆడనున్నాయి. ఈ సిరీస్ కి ధోని దూరమవడం వల్ల అతని స్థానంలో రిషబ్ పంత్ ఆడనున్నాడు.

 

Videos

Leave a Reply

Your email address will not be published.