కోహ్లీ ‘గుండె’ అతుక్కుంది -అనుష్క తో గాఢమైన ముద్దు

సెలబ్రిటీల వ్యవహారం కాస్త డిఫరెంట్.  వారు ఏం అనుకుంటే అది చెప్పగలరు. చెప్పకూడదంటే చెప్పరు. వ్యక్తిగత విషయాల్ని చెప్పమని ఫోర్స్ చేయలేం. అలా అని ఒక విషయం మీద తన బాధను షేర్ చేసుకొని.. కోట్లాది మంది చేత అయ్యో పాపం అని సానుభూతిని కొల్లగొట్టి.. ఇప్పుడు హ్యాపీగా ఉన్న ఇష్యూను అందరికి చెప్పకపోతే ఎలా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.

అవును.. నిజమే. విడిపోయాయనుకున్న ప్రేమపక్షులు మళ్లీ కలిశాయి. మీడియా కంట పడకుండా సీక్రెట్‌గా రొమాన్స్ చేసుకుంటున్న విరాట్ కోహ్లి, అనుష్కశర్మ.. శుక్రవారం ముంబై ఎయిర్‌పోర్టులో కౌగిలింతలు, ముద్దులతో హంగామా చేశారు. సుల్తాన్ సినిమా కోసం సల్మాన్‌ఖాన్‌తో కలిసి బుడాపెస్ట్ వెళ్తున్న అనుష్కకు సెండాఫ్ చెప్పడానికి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు విరాట్ కోహ్లి. ఈ సందర్భంగా ఇద్దరూ ఒకే కారులో కూర్చొని కాసేపు ముచ్చటించారు. తర్వాత గుడ్‌బై చెప్పిన అనుష్కను కౌగిలించుకొని ఓ ముద్దు కూడా ఇచ్చాడు కోహ్లి.

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ చాలాకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఇరువురి మధ్య విభేదాలు వచ్చినట్లుగా కనిపించింది. అ తర్వాత మళ్లీ ఒక్కటయ్యారు. ఇప్పుడు ఇరువురు ముద్దులు ఇచ్చుకోవడంపై మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *