వివో జెడ్ 1ఎక్స్ మొబైల్ ఫీచర్లు

చైనాకు చెందిన మొబైల్‌ వివో తన  జెడ్‌ సిరీస్‌లో మరో స్మార్ట్‌ ఫోన్‌ ను  ఆవిష్కరించింది.  వివో జెడ్ 1 ఎక్స్ పేరుతో భారతదేశంలో ప్రారంభించింది. వివో జెడ్-సిరీస్‌లో ఇది కంపెనీ రెండవ ఫోన్. ఇందులో 48 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అమోలేడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 712 సాక్‌, 22 వాట్‌ ఫ్లాష్‌చార్జ్‌ స్పెషల్‌ ఫీచర్లుగా ఉన్నాయి. ఫాంటమ్ పర్పుల్, ఫ్యూజన్ బ్లూ రంగులలో లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌, ఫ్లిప్‌కార్ట్, వివో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. వివో జెడ్ 1 ఎక్స్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ధర రూ.16,990(64జిబి), రూ.18,990(128జిబి).

ఫీచర్లు:

6.38-అంగుళాల సూపర్ అమోలెడ్‌ వాటర్‌ డ్రాప్ నాచ్‌ డిస్‌ ప్లే, స్నాప్‌ డ్రాగన్ 712 ఎఐఈ ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 9 పై, 48+ 2+8 ఎంపీ రియర్‌ ట్రిపుల్‌ కెమెరా, 32 ఎంపీ సెల్పీ కెమెరా, 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Videos