వచ్చే నెలలో కలెక్టర్ ఆమ్రపాలి పెళ్లి.. వరుడు ఎవరంటే…

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 18న ఆమె వివాహం నిశ్చయమైంది. వరుడు 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సమీర్‌ శర్మ. ఢిల్లీకి చెందిన ఈయన ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూ, డామన్‌లో ఎస్పీగా పని చేస్తున్నారు. దాదాపు మూడునాలుగేళ్ల నుంచి ఇద్దరు ప్రేమించుకుంటున్నారని, వారి పెళ్లికి ఇరువర్గాలకు చెందిన కుటుంబ సభ్యులు ఒకే చెప్పినట్టు సమాచారం. వచ్చే నెలలో వివాహం ఉండడంతో ఈ నెల 28వ తేదీ నుంచి కలెక్టర్‌ ఆమ్రపాలి సెలవులపై వెళుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆమ్రపాలి పెళ్లి జమ్మూకశ్మీర్‌లో జరుగుతుందని తెలుస్తోంది. వివాహం అనంతరం ఫిబ్రవరి 23న వరంగల్‌లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని సమాచారం.
అనతికాలంలోనే పేరు ప్రఖ్యాతలు
ఆమ్రపాలి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు కలెక్టర్‌గా వచ్చారు. మొన్న జరిగిన కలెక్టర్ల బదిలీల్లో వరంగల్ రూరల్ జిల్లా బాధ్యతలను కూడా ఆమ్రపాలికి అదనంగా అప్పగించారు. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎనర్జిటిక్‌, డైనమిక్‌ కలెక్టర్‌గా పేరు సంపాదించారు. యూత్‌కు ఒక ఐకాన్‌గా నిలిచారు. పలు కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. తాజాగా కలెక్టర్‌ ఆమ్రపాలి పెళ్లి ముచ్చట సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.
Videos

Leave a Reply

Your email address will not be published.