రాశిఫలాలు

రాశి ఫలాలు: ఫిబ్రవరి 8 నుంచి 13వ తేదీ వరకు
mesha-rasi మేషం రాశివారు (అశ్విని4పాదాలూ,భరణి 4పాదాలూ,కృత్తిక1 వపాదము )

13వ తేదీనుంచి శుక్రుడి మకర సంచారం వలన దోషఫల స్థానం, ధన నష్టపోతారు, వ్యాకులత చెందుతారు, విరోధము కలుగును, స్త్రీ సౌఖ్యం లోపిస్తుంది, శారీరక బలహీనత కలుగుతుంది, అవమానము చెందుతారు, తగాదాలు జరుగుతాయి, అపజయము పొందుతారు, వ్యవహారములలో నష్టము కలుగును. 10నుంచి బుధుడు మకర సంచారం వలన మిశ్రమఫల ప్రదము స్థానంలో బుధుడుండటం వలన. విశేషమైన సౌఖ్యము పొందుతారు, ధన లాభము కలుగుతుంది, కీర్తి పెరుగుతుంది, శత్రువులపై విజయము సాధిస్తారు. మరోవైపు సంతాపము కలుగుతుంది, అపవాదము ఏర్పడుతుంది, ఇతరులను దూషణ చేస్తారు, భోజనంలో అసౌఖ్యము కలుగుతుంది.
rushabam వృషభ రాశివారు (కృత్తిక 2,3,4 పాదాలూ ,రోహిణి 4పాదాలు, మృగశిర 1,2 పాదాలు)

13వతేదీనుంచి శుక్రుడి మకర సంచారం వలన గురుభక్తి కలుగుతుంది, ఇష్టకార్యములు సిద్ధిస్తాయి, మిత్రులు పెరుగుతారు, సుఖశాంతులు కలుగతాయి, గురు అనుగ్రహం పొందుతారు, సర్వత్రాలాభము జరుగుతుంది, తీర్థయాత్రలు చేస్తారు ఆచార జీవనము వంటి అనేక శుభ ఫలములు కలుగును.10నుంచి బుధుడు మకర సంచారం వలన ప్రతికూల ఫల ప్రదమగు స్థానంలో బుధుడుండటం వలన, కీర్తికి భంగము వాటిల్లుతుంది, చేసే పనులకు విఘ్నములు కలుగుతాయి, సోమరి తనము, బద్ధకం కలుగుతుంది, పిత్త వ్యాధులు(అనగా గ్యాస్టిక్‌ వ్యాధులు) కలుగుతాయి, ఇతరులకు అపకారము చేస్తారు, రుచించని పదార్థములు ఆహారంగా ప్రాప్తించుట జరుగును.
midhunarasi మిథున రాశివారు (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర 4పాదాలు ,పునర్వసు 1,2,3పాదాలు)

13వ తేదీనుంచి శుక్రుడి మకర సంచారం వలన శుభఫల స్థానం, ధనలాభము కలుగుతుంది, సౌఖ్యము పొందుతారు, బంధు సమాగమము, పెద్దల ఆదరణ పొందుతారు, ఆర్థిక లాభం కలుగుతుంది, ఆరోగ్యము పొందుతారు, దు:ఖం తగ్గుతుంది, కీర్తి పెరుగుతుంది, మిత్ర సహకారము పొందుతారు, గౌరము, పొందుతారు సంసార సౌఖ్యము అన్ని విధముల అభివృద్ధి కల్పించును,10 నుంచి బుధుడు మకర సంచారం వలన మిశ్రమఫల దాయకముమగు స్థానంలో బుధుడుండటం వలన. అనారోగ్యము కలుగుతుంది, శరీరంలో తాపము ఏర్పడుతుంది, మానసిక భయము కలుగుతుంది, వ్యాకులత చెందుతారు, అబద్ధపు మాటలాడతారు, పుత్రప్రాప్తి జరుగుతుంది, ధనలాభము కలుగుతుంది, అధికార పెరుగుతుంది, ప్రమోషనుల పొందుతారు, జయము కీర్తి పొందుతారు, సంతోషము కలుగుతుంది, శుభకరమైన పలితాలు కలుగును.(శుక్ర గ్రహ పరిహారాలు-త్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః ,ప్రభు స్తారా గ్రహాణాంచ పీడాంహరతుమే భ్రుగుః | ఈ శ్లోకాన్ని జపించాలి దానాలు చక్కెర, బబ్బెర్లు, అలంకరణ వస్తువులు. పూలు. ఆవు పూజలు. లలితా, కాలీ, శుక్ర గ్రహం పూజ చేయడం ఆయాదేవతల అష్టోత్తరశతనామాలు చదవటం రత్నాలు- వజ్రం ధరించాలి.
karkatarasi కర్కాటక రాశివారు (పునర్వసు 4 వపాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

13వ తేదీనుంచి శుక్రుడి మకర సంచారం వలన దోషఫల స్థానం. భార్యకు అనారోగ్యము కలుగుతుంది, కోపము పెరుగుతుంది, తాపము, వ్యాధులు, కష్టము కలుగుతాయి, విరోధములు ఏర్పడతాయి, మధుమేహ వ్యాధులు కలుగును, 10నుంచి బుధుడు మకర సంచారం వలన దుష్ఫల స్థానంలో బుధుడుండటం వలన, వస్తువులను నష్టపోతారు, శరీరంలో ఉష్ణతత్వము ఏర్పడుతుంది, పై అధికారులతో విరోధము ఏర్పడుతుంది, సర్వాంగములకు వ్యాధి కలుగుతుంది శరీరంలో అందము కళ తగ్గుతుంది, చేసే పనులలో విఘ్నము ఏర్పడుతుంది, వృధా కోర్కెలు కలుగుతాయి ,అశాంతి కలుగుతుంది, కుటుంబంలో కలహాలు ఏర్పడుతాయి, అనారోగ్యము కలుగుతుంది, ఇతరులతో విరోధము కలుగును.
simharasi సింహం రాశివారు (మఖ 4పాదాలూ,పుబ్బ 4 పాదాలూ ,ఉత్తర 1 వపాదం)

13వ తేదీ నుంచి శుక్రుడి మకర సంచారం వలన వ్యతిరేక ఫలస్థానం, ఋణ బాధలు కలుగుతాయి, శత్రువుల బాధలు కలుగుతాయి లేదా పెరుగుతాయి, అవమానము పొందుతారు, ఆతురత కలుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి, అపాయానికి అవకాశములున్నాయి, విపత్తు కలుగుతంది, వ్యవహారమందు చిక్కులు కలుగును, 10నుంచి బుధుడు మకర సంచారం వలన విద్యా వినోదముల ద్వారా సుఖము ఆనందం పొందుతారు, గౌరవము పొందుతారు, వస్త్రధన ధాస్యలాభము కలుగుతుంది, సుఖ శాంతులు పొందుతారు, ప్రజాభిమానము పొందుతారు, మనో ధైర్యము కలుగుతుంది, చేసే పనులలో జయము పొందుతారు, సమాజంలో కీర్తి కలుగుతుంది, ధన వృద్ధి జరుగుతుంది.
kanyarasi కన్య రాశివారు(ఉత్తర 2,3,4 పాదాలు ,హస్త 4 పాదాలూ ,చిత్త 1,2 పాదాలు)

13వ తేదీ నుంచి శుక్రుడి మకర సంచారం వలన శుభ ఫలస్థానము, ఇష్ట కార్యములు సిద్ధిస్తాయి, ధనధాన్య లాభంలుగుతుంది, దాస దాసీజన సేవలు పొందుతారు, మధుర పదార్థాలు పొందుతారు, సంతాన వృద్ధి కలుగుతుంది, పెద్దల ఆదరణ పొందుతారు, ధనప్రాప్తి కలుగుతుంది, శత్రువులు తగ్గుతారు, మిత్రుల ఆదరణ వంటి మంచి ఫలితములు కలుగును. 10నుంచి బుధుడు మకర సంచారం వలన దోష ఫలదుడగు స్థానంలో బుధుడుండటం వలన, అనారోగ్యము కలుగుతుంది, ఉష్ణబాధలు ఏర్పడుతాయి, ఇతరులో కలహము ఏర్పడుతుంది, శరీరంలో తాపము కలుగుతుంది, భార్యా పుత్రులతో భిన్నాభిప్రాయము ఏర్పడుతాయి, స్థితికి భంగము ఏర్పడుతుంది, వాతపిత్తాది వ్యాధులు కలుగుతాయి, శ్రమ పెరుగుతుంది. అపకీర్తి కలుగుతుంది.(శుక్ర గ్రహ పరిహారాలు- త్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః, ప్రభుస్తారా గ్రహాణాంచ పీడాంహరతుమే భ్రుగుః | ఈ శ్లోకాన్ని జపించాలి దానాలు చక్కెర, బబ్బెర్లు, అలంకరణ వస్తువులు. పూలు. ఆవు పూజలు. లలితా, కాలీ, శుక్ర గ్రహం పూజ చేయడం ఆయాదేవతల అష్టోత్తరశతనామాలు చదవటం. రత్నాలు- వజ్రం ధరించాలి.
thularasi తుల రాశివారు (చిత్త 3,4 పాదాలు, స్వాతి 4 పాదాలు,విశాఖ 1,2,3పాదాలు)

13వ తేదీ నుంచి శుక్రుడి మకర సంచారం వలన శుభఫల స్థానంలో శుక్రుడుండుట వల్ల. బంధువులతో సంతోషంగా గడుపుతారు, బుద్ధిబలం పెరగుతుంది, శక్తి యుక్తులు పెరుగుతాయి, బంధు మిత్రుల అనుకూలత పొందుతారు, వ్యవసాయ లాభము, అధికారం పెరుగుట లేదా ఉద్యోగంలో ప్రమోషన్‌ పొందుతారు, వినోదయాత్రలు చేస్తారు, మిత్రుల సహకారము లభించును,10నుంచి బుధుడు మకర సంచారం వలన శుభస్థానములో బుధుడుండటం వలన, ధన ధాన్య వృద్ధి జరుగుతుంది, బుద్ధి బలము పొందుతారు, కార్యములలో విజయమ సాధిస్తారు, తల్లివద్ద సంతొషంగా గడుపుతారు. కుటుంబలో అభివృద్ధి కలుగుతుంది, కాలం సంతోషముగా గడుస్తుంది, బంధువుల సహకారము పొందుతారు, కీర్తి ధనలాభము పొందుతారు, సుఖము పొందుతారు, కొత్త వస్తువులను పొందుతారు, రతి సౌఖ్యము కలుగుతుంది.
ruchikam వృశ్చిక రాశివారు (విశాఖ 4వపాదం ,అనూరాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు)

13వ తేదీ నుంచి శుక్రుడి మకర సంచారం వలన మిశ్రమ ఫలదాత. తలత్రిప్పుట, ధన వ్యయము జరుగును, శత్రువులు పెరుగుతారు, వ్యాపార నష్టము వంటి స్వల్ప వ్యతిరేక ఫలములతో పాటు శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. 10నుంచి బుధుడు మకర సంచారం వలన ప్రతికూల స్థానంలో బుధుడుండటం వలన, బుద్ధిబలం క్షీణిస్తుంది, మనస్తాపం కలుగుతుంది, ధన నష్టం ఏర్పడుతుంది, బంధువిరోధము కలుగుతుంది, ప్రభుత్వం నందు ప్రతికూలత కలుగుతుంది, మతిమరుపు ఏర్పడుతుంది, శత్రువుల వల్ల భయము పొందుతారు, అధికారులతో విరోధము ఏర్పడుతుంది. (శుక్రగ్రహ పరిహారాలు-త్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చమహామతిః ,ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాంహరతుమే భ్రుగుః | ఈ శ్లోకాన్ని జపించాలి దానాలు చక్కెర, బబ్బెర్లు, అలంకరణ వస్తువులు. పూలు. ఆవు పూజలు. లలితా, కాలీ, శుక్రగ్రహం పూజ చేయడం ఆయాదేవతల అష్టోత్తరశతనామాలు చదవటం రత్నాలు- వజ్రం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్ని బట్టిమాత్రమే ధరించాలి).
dhanurasi ధను రాశివారు (మూల 4పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వపాదం)

13వ తేదీ నుంచి శుక్రుడి మకర సంచారం వలన ఆరోగ్యము, కీర్తి, స్త్రీ సౌఖ్యము కలుగుతాయి, నూతన వస్త్రములు ధరిస్తారు, ధనం పొందుతాయి, కుటుంబంలో వృద్ధి జరుగుతుంది, దేహ సౌఖ్యము, మంచి మాటలు పలుకుట, బహుమానము పొందుట వంటివి జరుగుతాయి, కుటుంబ సౌఖ్యములు కలుగును,10నుంచి బుధుడు మకర సంచారం వలన శుభస్థానముంలో బుధుడుండటం వలన, సుఖము కలుగుతుంది, ఆరోగ్యము పొందుతారు, సజ్జన సహకారము కలుగుతుంది, ధన లాభము కలుగుతుంది, చేసేనులలో కార్యానుకూలత ఏర్పడుతుంది, సజ్జనులతో చర్చాగోష్టి జరుపుతారు, విలువైన రత్నములు వస్తువులు ప్రాప్తిస్తాయి.
makararasi మకర రాశివారు (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 1,2 పాదాలు)

13వ తేదీ నుంచి శుక్రుడి మకర సంచారం వలన మిక్కిలి అనుకూల స్థానం. మన:సౌఖ్యము పొందుతారు, సంసార సౌఖ్యముపొందుతారు, ప్రయత్నించిన కార్యములు సిద్ధిస్తాయి, అధికారం పెరుగుట లేదా ఉద్యోగంలో ప్రమోషన్‌ పొందుతారు, ధనలాభము కలుగుతుంది, విద్యావృద్ధి జరుగుతుంది పెద్ద చదువులకు అనుకూల కాలం, పరస్త్రీ సంగమం అవకాశం వుంది, సుఖము పొందుట, నూతన వస్త్రములు ప్రాప్తిస్తాయి, భోగ భాగ్యములు కలుగును.10నుంచి బుధుడు మకర సంచారం వలనదోష ఫలదుడుడగు స్థానంలో అనగా లగ్నంలో బుధుడుండుట వల్ల , అకాలంలో భోజనము చేయవలసి వస్తుంది, బంధువులతో శత్రుత్వము ఏర్పడుతుంది, దుష్ట సహవాము చేసారు, వస్తువులు నష్టపోతారు, శత్రువులు పెరుగుతారు, అస్థిరత కలుగుతుంది, బంధువుల వలన కష్టాలు కలుగుతాయి, తగువులు ఏర్పడుతాయి, నీచజనులతో స్నేహము ఏర్పడుతుంది, ధన నష్టము కలుగును.(శుక్రగ్రహ పరిహారాలు-త్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః ,ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాంహరతుమే భ్రుగుః | ఈ శ్లోకాన్ని జపించాలి దానాలు చక్కెర, బబ్బెర్లు, అలంకరణ వస్తువులు. పూలు. ఆవు పూజలు. లలితా, కాలీ, శుక్ర గ్రహం పూజ చేయడం ఆయాదేవతల అష్టోత్తరశతనామాలు చదవటం రత్నాలు- వజ్రం ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి).
kumbarasi కుంభ రాశివారు (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు ,పూర్వాభాద్ర 1,2,3పాదాలు)

13వ తేదీ నుంచి శుక్రుడి మకర సంచారం వలన మిశ్రమ ఫలస్థానము. ఖర్చులుపెరుగుతాయి, భయము కలుగుతుంది, ఆర్థిక నష్టము వంటి స్వల్ప వ్యతిరేకములతో పాటు సుఖానుభూతి మొదలగు కొన్ని అనుకూల ఫలములు కలుగును. 10నుండి బుధుడు మకర సంచారం వలనదోష ఫలప్రదమగుస్థానంలో బుధుడుండటం వలన. మనస్సంకటము కలుగుతుంది, సుఖంలోపిస్తుంది, శత్రువువల్ల బాధకలుగుతుంది, ఇంట్లో సమస్యలేర్పడతాయి, ఇతరులతో కలహము పొందుతారు, చేసేపనులలో అపజయము పొందుతారు, అకాలంలో భోజనము చేస్తారు, ఇతరులతో పరాభవము పొందుతారు, ఉద్రేకము కలుగును.(శుక్రగ్రహ పరిహారాలు-త్యమంత్రీ గురు స్తేషాం ప్రాణదశ్చమహామతిః ,ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాంహరతుమే భ్రు గుః | ఈ శ్లోకాన్ని జపించాలి దానాలు చక్కెర, బబ్బెర్లు, అలంకరణ వస్తువులు. పూలు. ఆవు పూజలు. లలితా, కాలీ, శుక్రగ్రహం పూజచేయడం ఆయాదేవతల అష్టోత్తరశతనామాలు చదవటం రత్నాలు- వజ్రం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్ని బట్టి మాత్రమే ధరించాలి).
meenarasi మీన రాశివారు (పూర్వాభాద్ర 4వ పాదం,ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు)

13వ తేదీ నుంచి శుక్రుడి మకర సంచారం వలన శుభఫల స్థానం. చక్కని మృష్టాన్న భోజనము చేస్తారు, కొత్త స్నేహితులు కలుగుతారు, స్త్రీ సౌఖ్యము పొందుతారు, శరీర సౌఖ్యము ఏర్పడుతుంది, శాంతియుత జీవనము గడుపుతారు, భయము తగ్గును, ధనలాభము కలుగును. ,10నుంచి బుధుడు మకర సంచారం వలన మిశ్రమ ఫల ప్రదము స్థానంలో బుధుడుండటం వలన. విశేషమైన సౌఖ్యము పొందుతారు, ధనలాభము కలుగుతుంది, కీర్తి పెరుగుతుంది, శత్రువులపై విజయము సాధిస్తారు. మరోవైపు సంతాపము కలుగుతుంది, అపవాదము ఏర్పడుతుంది, ఇతరులను దూషణ చేస్తారు, భోజనంలో అసౌఖ్యము కలుగుతుంది.