భారత్ సర్జికల్ స్ట్రయిక్: అంటే ఏమిటి, ఎలా చేస్తారు?

భారత సైన్యం గురువారంనాడు భారత ప్రజలంతా గర్వపడే పనిచేసింది. బాంబులు కురిపించడం ఆపేసి భారత సైన్యం టెర్రర్ లాంచ్ ప్యాడ్స్‌పై సర్జికల్ స్ట్రయిక్స్ చేసిందని డిజిఎంఓ లెఫ్టెనెంట్ జనరల్ రణబీర్ సింగ్ చెప్పారు. దీంతో సర్జికల్ స్ట్రయిక్స్ ఏమిటనే సందేహం రావడం సహజం. పెద్ద యెత్తున విధ్వంసం జరగకుండా నిర్దిష్టమైనదాన్ని విధ్వంసం చేసే వ్యూహంతో సైన్యం చేసే దాడి సర్జికల్ స్ట్రయిక్. ఒక్క నిర్దిష్టమైన స్థలంపై గురి తప్పకుండా సైన్యం దాడి చేయడం సర్జికల్ స్ట్రయిక్‌లో ఉంటుంది. తాము ఉద్దేశించిన, దాడికి అర్హమైన దాన్ని మాత్రమే విధ్వంసం చేయడానికి, పరిసరాల్లో నష్టం జరగకుండా చూస్తూ ఉద్దేశిస్తారు. అంటే, పరిసరాల్లోని నిర్మాణాలు, వాహనాలు, భవనాలు, ప్రజల మౌలిక సదుపాయాల వంటివాటికి నష్టం జరగకుండా జాగ్రత్త పడుతారు.

చెప్పాలంటే, మయన్మార్‌లో చేసిన దాడి ఇటువంటిదే. మయన్మార్‌లో 70 మంది భారత సైన్యానికి చెందిన కమెండోలు 40 నిమిషాల్లో అపరేషన్‌ను ముగించారు. ఇందులో 38 మంది నాగా తీవ్రవాదులు హతం కాగా, ఏడుగురు గాయపడ్డారు. నిర్దిష్టమైన స్థలాలను లక్ష్యం చేసుకుని దాడులు చేయడం కూడా సర్జికల్ స్ట్రయిక్‌లో భాగం. ఇది కార్పెట్ బాంబింగ్‌కు విరుద్ధమైంది. కార్పెట్ బాంబింగ్‌లో పెద్ద యెత్తున విధ్వంసం జరుగుతుంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో పెద్ద యెత్తున నష్టం వాటిల్లుతుంది. 2003 ఇరాక్ యుద్ధ సమయంలో అమెరికా బలగాలు బగ్దాద్‌పై తొలి విడత వేసిన బాంబుల తీరు సర్జికల్ స్ట్రయిక్స్ కిందికే వస్తాయి. అమెరికా ప్రభుత్వ భవనాలను, మిలిటరీ స్థావరాలను మాత్రమే లక్ష్యం చేసుకుని బాంబులు వేసింది.

ఉడీ ఉగ్రదాడి చేసేముందు ఉగ్రవాదులు పెద్దపెద్ద కొండ ప్రాంతాల నుంచి రెక్కీ నిర్వహించినట్లు తెలుసుకున్న ఇండియన్ ఆర్మీ… ఉడీ ఉగ్రదాడిలో నలుగురు ఉగ్రవాదులే హతమవడంతో మరింత మంది ఉగ్రవాదులు అదే కొండప్రాంతాల సమీపంలో ఉన్నట్లు సమాచారం అందుకున్నారు. దీంతో దీంతో వారం రోజుల నుంచి భారత సైన్యం ప్రణాళిక సిద్ధం చేసి నిఘా ప్రారంభించింది. ఈ సమయంలో ఉడీ ఉగ్రదాడి మాదిరిగానే వారు మరోసారి ఏక్షణంలో అయినా దాడి చేయొచ్చని నిఘా సమాచారం అందడంతో… వారి కంటే ముందు తామే బదులు చెప్పాలని నిర్ణయించుకుంది భారత సైన్యం. దీంతో నియంత్రణ రేఖను తొలిసారి దాటి పాకిస్థాన్ భూభాగం వైపు 500 మీటర్ల – 2.50 కిలోమీటర్ల ముందుకు కదిలిన భారత సైన్యం ఎనిమిది స్థావరాలపై దాడి చేశాయి.

ఈ ఆపరేషన్ నిర్వహించేందుకు భారత ఆర్మీ పారాకమాండోస్ – హెలికాప్టర్లను ఉపయోగించారు. ఎంపిక చేసుకున్న బలగాలను ఈ హెలికాప్టర్ల ద్వారా అనుమానిత ప్రాంతంలోకి దించిన అనంతరం ఒక్కసారిగా అనూహ్యంగా భారత్ సైన్యం సర్జికల్ ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాద శిబిరాలపై విరుచుకు పడింది. ఈ దాడిలో సుమారు 35 – 40 మంది ఉగ్రవాదులు హతమవగా – మరికొందరు బందీలుగా చిక్కారు. ఈ సమయంలో ఉగ్రవాద స్థావరాల్లో లభించిన ఆయుధాలు అన్నీ పాక్ కు చెందినవని గుర్తించిన ఆర్మీ – ఈ దాడిలో హతమైనవారు కూడా పాక్ ప్రాంతానికి చెందినవారని తెలిపింది.

Videos

202 thoughts on “భారత్ సర్జికల్ స్ట్రయిక్: అంటే ఏమిటి, ఎలా చేస్తారు?

Leave a Reply

Your email address will not be published.